Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: నా ఫస్ట్ భర్తకు నేను చేస్తున్న మనవి ఏమనగా ?, పీడకలలా మరిచిపో డియర్, రెండో పెళ్లి !

చెన్నై/తేన్ కాశి: యువతి, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని ప్రేమికులు అనుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్న ప్రేమికులు పెళ్లికి ముందే హ్యాపీగా విహారయాత్రలు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ప్రేమికుల విషయం చాలాకాలం పాటు సీక్రేట్ గా ఉన్నా తరువాత మ్యాటర్ లీక్ అయ్యింది. టెక్కీ ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియురాలు కొన్ని రోజుల్లోనే మరో యువకుడిని పెళ్లి చేసుకున్న వీడియో బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రియురాలి ఫ్యామిలీలోని అందరిమీద భర్త కేసు పెట్టడాడు. అయితే నా ఫస్ట్ భర్తకు మనవి చేయడం ఏమనగా అంటూ భార్య తెర మీదకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. మన ప్రేమ, పెళ్లి జరిగిన విషయం ఓ పీడకలా మరిచిపోవాలని కొత్త పెళ్లి కూతురు ఫస్ట్ భర్తకు చెప్పడం కలకలం రేపింది.

 మార్వాడి అమ్మాయితో లవ్

మార్వాడి అమ్మాయితో లవ్

తమిళనాడులోని తేన్ కాశి జిల్లా కొట్టాకుళం ప్రాంతానికి చెందిన మరియప్పన్ తేన్ కాశీలో వ్యవసాయం చేస్తున్నాడు. మరియప్పన్ కుమారుడు వినీత్ విదేశాల్లో చెన్నైసాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం వినీత్ చెన్నైలోని ప్రముఖ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. వినీత్, గుజరాత్‌ కు చెందిన కృతిక పటేల్ అనే అమ్మాయికి చాలా కాలం క్రితం పరిచయం అయ్యింది. తరువాత వినీత్, కృతిక పటేల్ ప్రేమించుకుంటున్నారు.

 లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమికులు

లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమికులు

కృతిక పటేల్, వినీత్ ప్రేమకు ఇంట్లో వారిద్దరూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గత ఏడాది డిసెంబర్ 27న ఇరు వైపుల తల్లిదండ్రుల ఎదిరించిన ప్రేమికులు కృతిక పటేల్, వినీత్ నాగర్ కోవిల్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కృతిక పటేల్, వినీత్ ఇద్దరూ తమ కొత్త జీవితాలను ప్రారంభించారు. వారం రోజుల పాటు కొత్త దంపతులు కృతిక పటేల్, వినీత్ హ్యాపీగా ఉన్నారు. తన ప్రియురాలు తనను పెళ్లి చేసుకుందని, జీవితాంతం ఆమెను సుఖంగా చూసుకోవాలని వినీత్ అనుకున్నాడు.

 నా భార్యను అప్పగించండి

నా భార్యను అప్పగించండి

కృతిక పటేల్ భర్త వినీత్‌పై దాడి చేసి కృతికను బలవంతంగా ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో విడుదల కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ కేసుకు సంబంధిత ఫిర్యాదులో కృతిక తల్లిదండ్రులతో సహా నలుగురి మీద కేసు పెట్టిన వినీత్ తనకు న్యాయం చెయ్యాలని పోలీసులకు మనవి చేశారు. తన భార్య కృతికను తనకు అప్పగించాలని టెక్కీ వినీత్ పోలీసుల కాళ్లుపట్టుకున్నాడు.

 రెండో పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లికూతురు

రెండో పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లికూతురు

నాలుగు రోజుల క్రితం టెక్కీ వినీత్ తలపై పిడుగు పడినట్లు అయ్యింది. వినీత్ భార్య కృతిక పటేల్ మరొకరిని పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి విడుదలైంది. అలాగే మైత్రిక్ పటేల్‌తో తన పెళ్లి జరిగిపోయిందని, తాను చాలా క్షేమంగా, సంతోషంగా ఉన్నానని, తన గురించి నువ్వు పట్టించుకోకూడదని భార్య వీడియోలో చెప్పడంతో టెక్కీ వినీత్ బిత్తపోయాడు.

 ఫస్ట్ భర్తకు నా మనవి ఏమనగా ?

ఫస్ట్ భర్తకు నా మనవి ఏమనగా ?

తన భార్య ఆమె పూర్తి అంగీకారంతో తనను వివాహం చేసుకుందని, ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోవాలని బెదిరించి కృతికతో బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి జరిపించారని ఆరోపిస్తూ వినీత్ పోలీసు కేసు పెట్టారు. సీసీటీవీ క్లిప్పింగ్స్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అయితే ఇదే సమయంలో టెక్కీ వినీత్ భార్య కృతిక పటేల్ తెరమీదకు వచ్చింది. వినీత్ తో రాజీకావాలని కృతిక పటేల్ ప్రయత్నించింది.

 ఓ పీడకలలా మరిచిపో డియర్

ఓ పీడకలలా మరిచిపో డియర్

నా కుటుంబ సభ్యులు మా బంధువుతో నాకు పెళ్లి జరిపించారని, నువ్వు, నేను ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలంటే మా తల్లిదండ్రులు, బంధువులు మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని వినీత్ కు అతని మాజీ ప్రియురాలు, మాజీ భార్య కృతిక పటేల్ మనవి చేసింది, నా ఇష్టప్రకారం నా బంధువును పెళ్లి చేసుకున్నానని, మన ప్రేమ, రిజిస్టర్ మ్యారేజ్ ఓ పీడకలలా మరిచిపోవాలని కృతిక పటేల్ ఆమె మాజీ భర్త వినీత్ కు మనవి చేసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య కృతిక పటేల్ మోసం చెయ్యడంతో ఆమె కుటుంబ సభ్యుల మీద పెట్టిన కేసు వినీత్ వాపస్ తీసుకుంటాడా ? లేదా ? అని వేచిచూడాలని పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+