ట్రంఫ్ ఎఫెక్ట్: ఇన్ఫోసిస్ నిర్ణయం, వారికి హెచ్1బి వీసా 'నో'

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అమెరికా తీసుకొంటున్న చర్యలతో దేశీయ ఐటి దిగ్గజం ఇన్సోసిస్ కీలక నిర్ణయం తీసుకొంది. జూనియర్ ఎంప్లాయిస్ కి హెచ్ 1 బీ వీసాలు ధరఖాస్తు చేయకూడదని నిర్ణయించింది.

వర్క్ వీసాలో వస్తున్న కఠినతరమైన నిబంధనలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా కంపెనీవర్గాలు ప్రకటించాయి.దేశీయ ఐటి కంపెనీలు హెచ్ 1 బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నాయి. కానీ, కొత్తగా ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఐటి కంపెనీలకు షాకిస్తూ హెచ్ 1 బీ వీసాల్లో మార్పులకు ప్రతిపాదనలు వస్తున్నాయి.

These Infosys employees may not get H-1B visa

దీంతో కంపెనీ హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించాయి. ఈ కర్రమంలోనే నాలుగేళ్ళ కంటే తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులకు వర్క్ వీసాలు అప్లయ్ చేయకూడదని ఇన్పోసిస్ నిర్ణయించింది.

ఇతర దేశాలకు వ్యాపారాలను తరలించే ప్రక్రియపై క్లయింట్లతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఇండియాలోనే ఎక్కువ పని ఉండేలా జూనియర్ ఎంప్లాయిస్ ను భారత్ కే ఎక్కువగా తీసుకొనేలా చర్యలు తీసుకొంటున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. సిస్టమ్స్ ఇంజనీర్స్, సీనియర్స్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కు ఇన్పోసిస్ వీసా అభ్యర్థనలను పంపలేదని మరో ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.

హెచ్ 1 బీ వీసా హెల్డర్స్ కనీస వేతనాన్ని ప్రస్తుతమున్న దానికి రెండింతలు చేస్తూ అంతకు ముందే అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రతిపాదించారు. ఈ వేతనాల పెంపు కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే జూనియర్లకు వీసాలు అప్లయ్ చేయకపోయే విషయమై కంపెనీ స్పందించడానికి నిరాకరించింది. జూనియర్ ఎంప్లాయిస్ కి వీసా ధరఖాస్దు చేయకపోివడం కంపెనీలో మరో సమస్య నెలకొంటుందని ఇన్పోసిస్ ఆందోళన చెందుతోన్నట్టు కన్పిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Infosys has decided not to apply for H-1B visas for junior employees, three sources with knowledge of the matter told ET, as the IT company comes to terms with the prospect of a tougher regulations governing the work visas.
Please Wait while comments are loading...