రానున్న రోజుల్లో పెరగబోయే స్టాక్స్ ఇవే
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కొంత ప్రతికూల వాతావరణం ఉండటంతో దేశంలోని స్టాక్ మార్కెట్ల సూచీలు హెచ్చుతగ్గుల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయాయి. మన దగ్గర బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 100 పాయింట్ల మేర పెరిగింది. 62 వేల 100 మార్కు వద్ద నిలిచింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో 18 వేల 300 మార్కు పైన చేరుకుంది. ప్రారంభంలో నష్టాల్లో ట్రేడ్ అయినప్పటికీ కొద్దిసేపటికి లాభాల్లోకి వెళ్లాయి. BSE లో నమోదైన షేర్లలో 1903 పెరగ్గా.. మరో 1177 పడిపోయాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కాస్తంత సానుకూలంగా నమోదవుతోంది. BSE అటిలిటీస్, BSE పవర్ సెక్టార్లు అత్యుత్తమ పనితీరు కనపరిచే సెక్టార్లుగా కొనసాగుతున్నాయి. ఒక శాతానికి పైగా పెరిగాయి.

అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ స్వింగ్‌లో ఉన్నాయి. BSE కన్జూమర్ డ్యూరబుల్స్, BSE ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు కూడా లాభాల్లో రాణిస్తున్నాయి. ఈరోజు HDFC లైఫ్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా రాణిస్తుండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందాల్కో క్షీణించాయి. స్వల్ప లాభాలతోనే ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ దూకుడుమీదున్నాయి. అప్పర్ సర్క్యూట్ లో లాకయ్యాయి. వాటిని వాచ్ లిస్టులో చేర్చుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పెన్నీ స్టాక్స్ పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తున్నాయి. రెండు స్టాక్స్ ఏకంగా 20 శాతం పెరగ్గా మరో 3 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. రానున్న రోజుల్లోనూ ఈ స్టాక్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే.. AA Plus Tradelink Ltd, Tarini International Ltd, nova Iron & Steel Ltd, Vintron Informatics Ltd, jyoti Structures Ltd












Click it and Unblock the Notifications