జయలలిత వైరల్ వీడియో: అపోలో ఆసుపత్రిలో కాదు, అక్కడే తీశారు, తిరుమావళన్ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గత సంవత్సరం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీశారంటూ విడుదలైన వీడియో గురువారం వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో అపోలో ఆసుపత్రిలో తీసింది కాందని తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీ నాయకుడు అంటున్నారు.
చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం వేదనిలయంలో ఆమెకు చికిత్స చేస్తున్న సమయంలో ఈ వీడియో తీశారని విధుతలై చిరుతైగల్ కచ్చి ( వీసీకే) నేత తిరుమావళన్ ఆరోపించారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో ఇదే అంటూ గురువారం టీటీవీ దినకరన్ వర్గం అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ ఓ వీడియో విడుదల చేశారు.

జయలలిత చికిత్స వీడియో విషయంలో వీసీకే నేత తిరుమావళన్ స్పంధించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగే ఒక్క రోజు ముందు టీటీవీ దినకరన్ తెలివిగా వీడియో విడుదల చేయించారని, ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నించారని తిరుమావళన్ ఆరోపించారు. ఆర్ కే నగర్ ప్రజలు ఈ వీడియో చూసి టీటీవీ దినకరన్ కు ఓట్లు వేసి మోసపోరాదని తిరుమావళన్ మనవి చేశారు.












Click it and Unblock the Notifications