అదే బెంగళూరులో.. తనను తాకిన వాడికి ఇలా బుద్ధి చెప్పింది

డిసెంబర్ 31వ తేదీ రాత్రి బెంగళూరులో ఓ యువతి తనను వేధించిన ఓ ఆకతాయికి జీవితంలో మరిచిపోలేని విధంగా బుద్ధి చెప్పింది.

బెంగళూరు: కొత్త ఏడాది సందర్భంగా బెంగళూరులో అమ్మాయిల పట్ల పలువురు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

అయితే, అదే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బెంగళూరులో ఓ యువతి తనను వేధించిన ఓ ఆకతాయికి జీవితంలో మరిచిపోలేని విధంగా బుద్ధి చెప్పింది. ఇందుకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించింది.

ఆమె పేరు చైతాలీ వాస్నిక్. తనను వేధించబోయిన ఆకతాయిని పట్టుకొని పిడిగుద్దులు కురిపించింది. అతనిని తన్నింది. దీంతో అతను పారిపోయాడు. తన అనుభవాన్ని ఆమె ఫేస్‌బుక్ ద్వారా వివరించింది. ఇది వైరల్ అయింది.

This Bengaluru woman gave a lesson to her molester on New Year’s Eve he’ll never forget

డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి విధులు ముగించుకొని చైతాలీ వాస్నిక్ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నారు. కాస్త దూరం వెళ్లాక ఓ యువకుడు వచ్చి ఆమెను అసభ్యంగా తాకాడు. వెంటనే అతనికి ఆమె తగిన విధంగా బుద్ధి చెప్పింది.

కొందరు విడిపించేందుకు వచ్చారు. తాను ఆమెను ఏమీ అనలేదని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ఆగ్రహంతో మరోసారి కొట్టింది. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు.

అలా ప్రవర్తించిన వ్యక్తి ఆ సమయంలో తాకి ఉన్నాడని చెప్పారు. తనది లేట్ నైట్ వర్క్ అని, తాను ప్రతి రోజు రోడ్డు మీదకు వచ్చినప్పుడు పోలీసులు తక్కువగా కనిపిస్తుంటారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+