తీహార్ జైల్లో కేజ్రీవాల్ జైలు జీవితం ఇలా.. ఢిల్లీ సీఎంకు ఇచ్చిన వసతులిలా!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కు తీహార్ జైలు బాట తప్పలేదు. ఈడీ విచారణ ఎదుర్కొని, ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించిన అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఏ నెంబర్ బారెక్ లో ఉండబోతున్నారు? జైలులో ఆయన దినచర్య ఏ విధంగా ఉండబోతుంది? అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది.
తీహార్ జైలుకు తరలించబడిన అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైల్లోని జైలు నెంబర్ 2 ను కేటాయించారు. ఇదిలా ఉంటే జైలులో అరవింద్ కేజ్రీవాల్ కు టీవీ చూసే సౌకర్యాన్ని కల్పించారు. ఆయన మొత్తం 18 నుండి 20 చానల్స్ ను చూసే అవకాశం కల్పించారు. అరవింద్ కేజ్రివాల్ డయాబెటిక్ పేషెంట్ కావడంతో, ఆయనకు రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయడానికి 24 గంటలు మెడికల్ స్టాప్ అందుబాటులో ఉంటారు.

ఇక వారంలో రెండుసార్లు కుటుంబ సభ్యులను కలుసుకునే వీలును కల్పించారు. అయితే కుటుంబ సభ్యుల జాబితాను నిర్ధారించుకున్న తర్వాతనే జైలు అధికారులు వారిని అనుమతిస్తారు. జైల్లో కేజ్రీవాల్ దినచర్య, జైలు ఇతర ఖైదీల దినచర్యతో పాటే ప్రారంభమవుతుంది. ఉదయం ఆరున్నర గంటలకు దినచర్య ప్రారంభం కాగా , ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా టీ, బ్రెడ్ ఇస్తారు.
ఇక కేజ్రీవాల్ ఆ తర్వాత తన కేసు విచారణ ఉంటే కోర్టుకు, లేదంటే తన న్యాయవాదుల బృందంతో సమావేశం అవుతారు. పదిన్నర గంటల నుండి 11 గంటల వరకు లంచ్ ఇస్తారు. ఇందులో పప్పు, కూరలు రొట్టెలు కానీ అన్నం కానీ పెడతారు. ఆ తర్వాత మూడు గంటల నుండి ఖైదీలను సెల్లోనే ఉంచుతారు.
మూడున్నర గంటలకు టీ, రెండు బిస్కెట్లు ఇస్తారు. ఆపై లాయర్లను కలవచ్చు. ఇక జైలులో సాయంత్రం ఐదున్నర గంటలకు డిన్నర్ ఉంటుంది. ఆపై ఏడు గంటల నుండి జైలు గదిలోనే ఉంటారు. ఇలా ఆయన దినచర్య కొనసాగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ తనను అరెస్ట్ చేయటంపై కోర్టులో ఫైట్ కొనసాగిస్తున్నారు. తన అరెస్ట్ అక్రమమని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications