కిస్సా కుర్సీకా అంటే ఇదే..! కుర్చీ ఖాళీ లేనప్పుడు సీయంను కాలేనన్న సిద్దరామయ్య..!!
బెంగళూరు/హైదరాబాద్ : కిస్సా కుర్సీ కా అంటే ఇదే.. ఎప్పుడూ సంచలనాలు చేస్తూ వార్తల్లో నిలిచే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య మరోసారి కర్ణాటక సీయం కుర్చీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని కాసేపు నవ్వించారు. సీఎం కుర్చీనే ఖాళీ లేకుంటే, నేనెలా ముఖ్యమంత్రి అవుతానన్నారు..? మాజీ ముఖ్యమంత్రి సిద్దా రామయ్య. బుధవారం హుబ్బళ్ళి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు. కొందరు అభిమానంతో అలా అంటుంటారని ఎమ్మెల్యేలు నా పట్ల ప్రత్యేకత చూపుతున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతితో కూరుకుపోయారని అందుకే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారని వారి పరిపాలనకు అదే అద్దం పట్టినట్టు అని వ్యాఖ్యానించారు.

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగానని, అవినీతికి తావు లేకుండా పాలన సాగించానన్నారు సిద్దా రామయ్య. జేడీఎస్ సీనియర్ నేత బసవరాజ్ హొరట్టి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి స్థానం నుంచి రమేశ్ జార్కిహొళిని తొలగించడంతోనే వివాదం కొనసాగుతోందనడం సరికాదన్నారు. హొరట్టి మౌనంగా ఉంటే బాగుంటుందన్నారు. దేశంలో కెల్ల కర్ణాటక రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, కర్ణాటక ఓటర్లు విజ్నత కలిగిన వారని సిద్ద రామయ్య పేర్కొన్నారు. సమయం అనుకూలించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేది స్పష్టత వస్తుంది తప్ప, తొందరపడితే ఎలాంటి ఫలితాలు ఉండవని విలేఖరులతో పిచ్చాపాటి గా మాట్లాడారు సిద్ద రామయ్య.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!











Click it and Unblock the Notifications