వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ కుర్చీలో ఎంఏల్ఏ కూర్చొని సభను రేపటికి వాయిదా వేశాడు,తర్వాత ఏమైందంటే..

అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ముగ్గురు బిజెపి ఎంఏల్ఏలను శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు శీతాకాల సమావేశాలు కొనసాగుతాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హిమాచల్ ప్రదేశ్ :అసలే శీతాకాలం, చలి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. కాని, అసెంబ్లీ సమావేశాలు రాజకీయపార్టీల్లో వేడిని రగిలిస్తోంది. త్రిపుర అసెంబ్లీలో ఓ ఎంఏల్ఏ స్పీకర్ టేబుల్ పై ఉన్న గదను (అధికార దండం) తీసుకొని బయటకు పరిగెత్తిన ఘటన మరువకముందే , స్పీకర్ స్థానంలో కూర్చొని ఓ ఎంఏల్ఏ అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ ప్రకటనతో మరో ఇద్దరు ఎంఏల్ఏలు సభ నుండి వెళ్ళిపోయారు. సభ సంప్రదాయాలను ఉల్లంఘించిన ఈ ముగ్గురిపై ఈ సమావేశాలు ముగిసే వరకు సస్సెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ ఘటన హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకొంది.

శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఆయా రాష్ట్రాల్లో వేడిని పుట్టిస్తున్నాయి. త్రిపుర ఘటనను మరవకముందే హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకొన్న ఘటన ఆ రాష్ట్రంలో సంచలనానికి తెరతీసింది.సభలోకి స్పీకర్ రాకముందే ఆయన స్థానంలో కూర్చొని ఓ ఎంఏల్ఏ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం వివాదాస్పదమైంది.

himchal pradesh assembly

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నుండి ముగ్గురు బిజెపి ఎంఏల్ఏలను శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ బుటాలీ ప్రకటించారు. సభ మర్యాదలు పాటించని కారణంగా వారిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ కొనసాగుతోందని స్పీకర్ ప్రకటించారు.

ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై ఎంఏల్ఏలతో చర్చించేందుకు స్పీకర్ బుటాలీ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఎంఏల్ఏలతో సమావేశమై ఆయన తిరిగి సభను ప్రారంభించేందుకు సభలోకి వచ్చే లోపుగానే ఆయన స్థానంలో ప్యానల్ స్పీకర్ గా ఉన్న బిజెపి ఎంఏల్ఏ సురేష్ భరద్వాజ్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన చేయగానే మరో ఇద్దరు బిజెపి ఎంఏల్ఏలు కూడ సభ నుండి బయటకు
వెళ్ళిపోయారు.

ఈ ఘటనతో ఈ ముగ్గురు ఎంఏల్ఏలు సభ మర్యాదలు పాటించడం లేదని వారిని సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి ముఖేష్ అగ్నిహోత్రి తీర్మానం ప్రవేశపెట్టారు.బిజెపికి చెందిన ముగ్గురు ఎంఏల్ఏలు సురేష్ భరద్వాజ్ , రాజీవ్ బిందాల్, రవీంద్రశర్మలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

English summary
who act against the rules of assembly those three bjp mlas suspended from assembly winter session in himachal pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X