Kiran Rathod: సినీ నటి బంపర్ ఆఫర్.. ఫొటోకు వెయ్యి.. వీడియోకు రూ.14 వేలు..
డబ్బులు సంపాదించడానికి కొందరు చేసే పని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎలాంటి కష్టం లేకుండా ఫొటోల డబ్బులు సంపాదిస్తోంది ఓ సినీ నటి. అంతే కాదు అభిమానులతో వీడియో కాల్ మాట్లేందుకు డబ్బులు కూడా వసూలు చేస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసుకుందాం పదండి..
2002లో కోలీవుడ్‌లో చియాన్ విక్రమ్‌తో కలిసి 'జెమినీ'లో నటించిన నటి కిరణ్ రాథోడే(Kiran Rathod) ఆ నటి. ఆమె కమల్ హాసన్‌తో 'అన్బే శివం', అజిత్ 'విలన్'లో కూడా నటించారు. ఇటీవలి కాలంలో సుందర్ సి 'ఆంబల', కె. భాగ్యరాజ్ 'ముత్తిన కత్తికిక్కై' చిత్రాల్లో ఆమె క్యారెక్టర్, గ్లామర్ పాత్రలలో నటించింది.

విన్నర్, తెన్నవన్ చిత్రాల్లోనే కాకుండా తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ కిరణ్ రాథోడ్ నటించారు. ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరుమయ్యారు. అయితే కిరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడరు. 40 ఏళ్లు పైబడినప్పటికీ ఆమె తన అందంతో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కిరణ్ ఫిబ్రవరి 2022, సెప్టెంబరు 2022లో తనకు సంబంధించిన రెండు ఫొటోల్నిపంచుకున్నారు.
కేవలం 7 నెలల వ్యవధిలో నమ్మశక్యం కాని 20 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. లావు తగ్గడానికి ఆమె ఏం చేసిందో తెలుపుతూ అభిమానులకు గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేస్తూ అలరిస్తూ వస్తోంది. కిరణ్ రాథోడ్ అక్కడితో ఆగకుండా కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం కూడా చేస్తోంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుందట.
వీడియో కాల్‌లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాలటా. ఇలా అభిమానుల నుంచి కాసులు రాబడుతున్న కిరణ్ ఒక క్యాప్షన్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అందులో గుడ్ గర్‌ల్స్ డోంట్ మేక్ హిస్ట్రరీ బోల్డ్ గర్‌ల్స్ మేక్ హిస్టరీ అని రాశారు. ఆమె లావు తగ్గడానికి మార్గం సులభం కాదని, కఠినమైన వ్యాయామాలు, కఠినమైన డైటింగ్‌లు చేయాలని చెప్పింది.












Click it and Unblock the Notifications