నాపేరు టామీ: పెంపుడు కుక్కకు ఆధార్ కార్డు

బిండ్: కుక్కకి ఆధార్ కార్డు పొందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెంపుడు కుక్కకు ఆధార్ కార్డు మంజూరైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమ్రి పట్టణంలో చోటు చేసుకుంది. పెంపుడు కుక్కకు ఆధార్‌కార్డు మంజూరవడంతో అధికారులు నిర్లక్ష్యం మరోసారి బయట పడింది.

వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో అజాంఖాన్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కుకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తుని పరిశీలించిన అధికారులు కుక్కకు ఆధార్ కార్డు మంజారు చేశారు.

ఆధార్ కార్డులో కుక్కకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పేరు: టామీ సింగ్, తండ్రి పేరు: శేరు సింగ్, పుట్టినరోజు: 26 నవంబర్ 2009 అని నమోదై ఉన్నాయి. ఈ విషయం తెలిసిన స్ధానికులు ఉమ్రి పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tommy mera naam: Man arrested for getting Aadhar card made for dog

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అజాం ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆధార్ కార్డు జారీ చేసే ఏజెన్సీలు ఇటీవల కాలంలో కుక్కలు, జంతువులకు ఆధార్ కార్డులను జారీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగక్కుండా ఆధార్ కార్డు ఏజెన్సీలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బింద్ ఎస్పీ నవనీత్ బాసిన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+