ఆల్‌ఖైదా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో బిజెపి అగ్ర నేతలు
న్యూఢిల్లీ: కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా హిట్‌లిస్ట్‌లో పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. గత బుధవారం బెంగళూరులో ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన సయ్యద్ అంజర్ షా ఖాజ్మిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతనిని విచారించిన అనంతరం ఆల్‌ఖైదా హిట్‌లిస్టులో పలువురు బిజెపి అగ్ర నేతలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని గురువారం పాటియాలా కోర్టులో హాజరుపరిచారు.

జనవరి 20 వరకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అతనికి రాజకీయనాయకులతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అల్‌ఖైదా భారత ఉపఖండంలో ఉగ్రదాడి జరిపేందుకు కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications