వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్, మెటా ఇండియా ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా..

|
Google Oneindia TeluguNews

ఎలాన్ మాస్క్ ట్విట్టర్ హ్యాండొవర్ చేసుకున్నాక సోషల్ మీడియాలో జాబ్స్ చేస్తోన్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. మెటా కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపడుతామని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ పదవీకి రాజీనామా చేశారు. అతను గత నాలుగేళ్ల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. అంతకుముందు ఇంపాక్ట్ ఆఫ్ ఇండియా సహా పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఉంది.తన పదవీకి రాజీనామా చేసిన తర్వాత బోస్.. లింక్ డిన్‌లో ఇలా రాశారు. తాను చిన్న బ్రేక్ తీసుకున్నానని తెలిపారు. త్వరలోనే కొత్త ప్రాజెక్టులో చేరుతున్నానని వివరించారు.

మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా రాజీనామా చేశారు. వీరిద్దరీ రాజీనామాను మెటా కూడా కన్ఫామ్ చేసింది. రాజీవ్‌కు ఇతర అవకాశం రావడంతో తప్పుకున్నారు. అభిజిత్ బోస్ వాట్సాప్‌కు అందించిన సేవలను వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ప్రశంసించారు. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేసిన కొద్దిరోజులకే వీరిద్దరూ రాజీనామా చేశారు. ఈ సెప్టెంబర్‌ళో వాట్సాప్ పేమెంట్ హెడ్ మనేశ్ మహాత్మే కూడా రాజీనామా చేశారు.

Top WhatsApp and Meta executives in India resign

యూజర్ సేప్టీ, ప్రైవసీ, దేశంలో డిజిటల్ ఇన్ క్లూజర్ డ్రైవ్ విభాగంలో రాజీవ్ అగర్వాల్ విశేష కృషి చేశారు. గోల్ వంటి ప్రోగ్రామ్స్ చేశారు. పబ్లిక్ పాలసీ ఫర్ మెటా ఇండియా హెడ్‌గా శివనాత్ తుక్రాల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అతను నుంచి పబ్లిక్ పాలసీ బృందంలో పనిచేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ పబ్లిక్ పాలసీ మెటా హెడ్‌గా కొనసాగుతారు.

English summary
Abhijit Bose has stepped down from his post of WhatsApp India head. Rajiv Aggarwal, who is the Director Public policy at Meta India, has also resigned
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X