వైరల్ వీడియో: అయ్యో.. క్షణాల్లో బాస్కెట్ బాల్ ప్లేయర్ మృతి
బాస్కెట్ బాల్ ఆడుతూ ఓ యువ క్రీడాకారుడు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఈ షాకింగ్ ఘటన హరియాణాలో జరిగింది.

ఆ యువకుడిని దురదృష్టం వెంటాడింది. చిన్న వయసులోనే మృత్యువు కబలించింది. సరదాగా స్కెట్ బాల్ ఆడుతూ క్షణాల్లో అనంతలోకాల్లో కలిసిపోయాడు. వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ బాల్ వేసే పోల్ వద్ద కాసేపు ప్రాక్టీస్ చేశాడు. అనంతరం మరోసారి పోల్ ను లాగడంతో ఆ పోల్ మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోల్ అతడి గుండెకు బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీలో ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.
हरियाणा के रोहतक में एक होनहार खिलाड़ी प्रशासन की लापरवाही का शिकार हो गया।
— Jitender Sharma (@capt_ivane) November 26, 2025
बास्केटबॉल की प्रैक्टिस कर रहे खिलाड़ी पर पोल जा गिरा और उसकी मौत हो गयी। #Rohtak #NationalPlayer @cmohry @DC_Rohtak @mansukhmandviya @YASMinistry pic.twitter.com/LnXfk9TO8j
హరియాణాలోని రోహ్ తక్ జిల్లా లఖన్ మజ్రా గ్రామంలో విషాద ఘటన జరిగింది. నవంబర్ 25 న గ్రామంలోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడైన హార్దిక్ రాతి (16) గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూనే ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. బాస్కెట్ బాల్ పోల్ విరిగి అతడి మీద పడింది. దాంతో హార్దిక్ వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ పోల్ బరువంతా అతడి బాడీపై పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన తోటి క్రీడాకారులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications