వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినియోగదారుల ఇష్టమే ఫైనల్..! కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కేబుల్ టీవి, డీటీహెచ్ ఆపరేటర్లపై మరోసారి ఫైరయింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవలి కాలంలో కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించని కేబుల్ టీవి, డీటీహెచ్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ట్రాయ్ తెరపైకి తెచ్చిన కొత్త నిబంధనలను కొందరు బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు ట్రాయ్ ఛైర్మన్ ఆర్‌.ఎస్‌.శర్మ. ట్రాయ్ నియమనిబంధనలు పాటించని సంస్థలు, దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చందాదారులు, కేబుల్‌ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలోనే ఆడిట్‌ చేస్తామని తెలిపారు.

ఉత్కంఠకు బ్రేక్.. రాహుల్ అమేథి నామినేషన్ ఓకే..!ఉత్కంఠకు బ్రేక్.. రాహుల్ అమేథి నామినేషన్ ఓకే..!

TRAI warning to cable and dth operators due to new norms violation

వినియోగదారులను కొందరు కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు శర్మ. వాటిలో కొంతమేర సాఫ్ట్‌వేర్‌, టెక్నికల్ సమస్యలుంటే.. వినియోగదారుల ఎంపిక ప్రకారం ఛానళ్ల ప్రసారం జరగడం లేదనేది కొందరు కంప్లైంట్స్ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఇక్కడ కస్టమర్ ఇష్టమే ఫైనల్ నిర్ణయమని.. ఆ మేరకు ఎవరు కూడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందుకే ఎవరైనా సరే వినియోగదారుడి అభీష్టం మేరకు ప్రసారాలు ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

English summary
TRAI warning to cable and dth operators due to new norms violation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X