Jharkhand Assembly election 2024: జార్ఖండ్ లో కీలకంగా మారిన గిరిజనుల ఓట్లు..!

జార్ఖండ్ లో అధికారమే లక్ష్యంగా పార్టీలు ప్రయత్నాలు చేస్తోంది. జార్ఖండ్ లో కీలకమైన గిరిజనుల ఓట్ల రాబట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో గిరిజనేతర స్థానాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని నివేదికలు సూచిస్తుండడంతో ప్రతి అవకాశం వినియోగించుకోవాలని చూస్తోన్నాయి. జార్ఖండ్(Jharkhand Assembly election 2024) లో నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 20న రెండో దఫా పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. బీజేపీతో పాటు మిగతా పార్టీలు కూడా గిరిజనుల ఓట్లపై దృష్టి సారించాయి.

లోక్తంత్ర బచావో అభియాన్ (సేవ్ డెమోక్రసీ క్యాంపెయిన్), హక్కుల సంఘాల బృందం నేతృత్వంలో అక్కడ జార్ఖండ్ ఉద్యమం కొనసాగుతోంది. "అబువా జార్ఖండ్, అబువా రాజ్" (మా జార్ఖండ్, మా పాలన) నినాదం పోరాటం కొనసాగుతోంది. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను తమ మ్యానిఫెస్టోల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. జార్ఖండ్ లో గణనీయమైన గిరిజన జనాభా ఉంది. వీరు అభ్యర్థుల గెలుపును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాల్లో మూడో వంతు కంటే ఎక్కువ 28 ఆదివాసీలకు రిజర్వ్ సీట్లుగా ఉన్నాయి.

Tribal Votes Will Be Crucial For All Parties In Jharkhand Assembly election 2024

ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో మహాయుతి కూటమి గిరిజన నియోజకవర్గాలలో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలలో దీన్నీ అధిగమించడానికి బీజేపీకి పెద్ద సవాల్ గా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్ జనాభాలో 26% గిరిజనులు ఉన్నారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 21 జిల్లాల్లో కనీసం లక్ష మంది ఉన్నారు. అత్యధిక జనాభా కలిగిన కమ్యూనిటీలలో సంతాల్‌లు ఉన్నారు. వీరి సంఖ్య 27.55 లక్షలుగా ఉంది. ఆ తర్వాత ఒరాన్‌లు (17.17 లక్షలు), ముండాలు (12.29 లక్షలు) ఉన్నారు.

గిరిజనులు కనీసం 20% ఉన్న అసెంబ్లీ స్థానాలు 43 ఉన్నాయి. 22 స్థానాల్లో వారు జనాభాలో సగానికి పైగా ఉన్నారు. ప్రస్తుతం JMM-కాంగ్రెస్-RJD కూటమి అధికారంలో ఉంది. గిరిజనులు అధికంగా ఉన్న 28 చోట్ల ఈ కూటమి 19 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి JMM నేతృత్వంలోని కూటమి మళ్లీ గిరిజన స్థానాల్లో తన పనితీరును పునరావృతం చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుతో లోక్‌సభ ఎన్నికలకు ముందు సానుభూతి లభించింది. దీంతో JMM, కాంగ్రెస్ మొత్తం ఐదు ST-రిజర్వ్‌డ్ పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+