ఎలాన్ మస్క్ పార్టీపైన ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు
అమెరికా రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికాలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించారు. అమెరికాలో డెమోక్రాట్ లకు, రిపబ్లికన్ లకు ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ అవసరమని పేర్కొన్న ఎలాన్ మస్క్ గత కొంతకాలంగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో ట్రంప్ తీరును వ్యతిరేకిస్తున్నారు.
మస్క్ దారుణ స్థితిలో ఉన్నాడన్న ట్రంప్
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకువస్తే తాను కొత్త పార్టీ పెడతానని తేల్చి చెప్పిన ఎలాన్ మస్క్ ఎట్టకేలకు అన్నంత పనిచేశారు. ఇక ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పైన డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ మొదలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్న ఆయన మస్క్ ప్రస్తుతం దారుణమైన స్థితిలో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో మూడో పార్టీ పని చెయ్యదన్న ట్రంప్
అమెరికా కేవలం రెండు పార్టీలకు సంబంధించిన వ్యవస్థ అని, ఇక్కడ మస్క్ మూడో పార్టీ మొదలుపెట్టడం హాస్యాస్పదంగా కనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలను తికమక పెట్టడమే నని పేర్కొన్న ట్రంప్ అమెరికాలో మూడో పార్టీ పని చెయ్యదు అని తేల్చి చెప్పారు.
వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్ తీసుకువచ్చిన ట్రంప్
కొంతకాలం క్రితం వరకు చాలా స్నేహపూర్వకంగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చు పెట్టింది. ఎన్నికల సమయంలో కూడా మస్క్ ట్రంప్ విజయం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకువచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా ఎలాన్ మస్క్ నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
యూఎస్ లో ట్రంప్ వర్సెస్ మస్క్
దీంతో మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఎలాన్ మస్క్ ఫైనల్ గా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి అమెరికా రాజకీయాలలో సంచలనాలకు తెర తీశారు. అమెరికా ప్రజల స్వేచ్ఛను మళ్ళీ వారికి అందించడానికి అమెరికా పార్టీ ఏర్పడిందని, ఇది అమెరికా ప్రజలకు కావలసిన కొత్త పార్టీ అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ట్రంప్ వర్సెస్ మస్క్ అన్నట్టు కొనసాగుతున్న ఈ వార్ రాజకీయంగా ఆసక్తికర రూపు దాల్చింది. భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అన్న ఆసక్తికి కారణంగా మారింది












Click it and Unblock the Notifications