వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత నియోజక వర్గం ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీటీ దినకరన్ పోటీ, అదే టోపి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు డిసెంబర్ 21వ తేదీ నిర్వహిస్తామని శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆర్ కే నగర్ లో గతంలో బరిలోదిగి అదే టోపి గుర్తుతో పోటీ చెయ్యాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారని తెలిసింది.

జయలలిత మృతి: ఉపరాష్ట్రపతి, గవర్నర్, పన్నీర్ సెల్వంను విచారణ చెయ్యాలి, పిటిషన్!జయలలిత మృతి: ఉపరాష్ట్రపతి, గవర్నర్, పన్నీర్ సెల్వంను విచారణ చెయ్యాలి, పిటిషన్!

ఆర్ కే నగర్ లో తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చెయ్యాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు. అన్నాడీఎంకే పార్టీ ఓట్లు చీల్చి అధికారంలో ఉన్న ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని మన్నార్ గుడి మాఫియా పక్కా ప్లాన్ వేస్తున్నదని సమాచారం. శశికళ ఆదేశిస్తే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని గురువారం టీటీవీ దినకరన్ చెప్పిన విషయం తెలిసిందే.

 TTV Dinakaran again uses his symbol as hat in RK Nagar by poll

అయితే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ పకటించిన వెంటనే టీటీవీ దినకరన్ మాటమార్చారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని శుక్రవారం టీటీవీ దినకరన్ చెప్పారు. నిజమైన అన్నాడీఎంకే పార్టీ మాదే, కార్యకర్తలు మా వెంటే ఉన్నారని టీటీవీ దినకరన్ అంటున్నారు.

పార్టీ, రెండాకులు కోతుల చేతికి వెళ్లాయి, కోతి చేతికి చిప్ప ఇస్తే, సుప్రీం కోర్టుకు, మన్నార్ గుడి!పార్టీ, రెండాకులు కోతుల చేతికి వెళ్లాయి, కోతి చేతికి చిప్ప ఇస్తే, సుప్రీం కోర్టుకు, మన్నార్ గుడి!

గతంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో టీటీవీ దినకరన్ కు భారత ఎన్నికల కమిషన్ టోపి గుర్తు కేటాయించింది. ఇప్పుడు మళ్లీ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించిన టీటీవీ దినకరన్ భారత ఎన్నికల కమిషన్ ను టోపీ గుర్తు కేటాయించాలని మనవి చెయ్యాలని నిర్ణయించారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

English summary
TTV Dinakaran has to use Hat symbol again as EC allots twin leaves to Edappadi team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X