మంత్రి ఉదయ్ కుమార్ మీద వేటు వేసిన టీటీవీ దినకరన్: ఆ పదవి నాదే, అతను ఎవరు ?
అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఆ పార్టీ మీద పెత్తనం చెలాయించాడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఆ పార్టీ మీద పెత్తనం చెలాయించాడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు మంత్రి ఉదయ్ కుమార్ ను నామినేటెడ్ పదవి నుంచి తప్పించారు.
మంత్రి ఉదయ్ కుమార్ అన్నాడీఎంకే పార్టీ అనుబంద సంస్థ అయిన జయలలిత పేరవై ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. బుధవారం జయలలిత పేరవై ప్రధాన కార్యదర్శి పదవి నుంచి మంత్రి ఉదయ్ కుమార్ ను తప్పించామని టీటీవీ దినకరన్ ప్రకటించారు.

జయలితకు నిజమైన వారసులు మేమే, అన్నాడీఎంకే పార్టీ కూడా మాదే అంటూ టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి ఉదయ్ కుమార్ స్పందిస్తూ అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రదాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ తనను పదవి నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. జయలలిత పేరవై ప్రధాన కార్యదర్శిగా తాను కొనసాగుతానని, నన్ను తొలగించే అధికారం దినకరన్ కు లేదని మంత్రి ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications