తొక్కిసలాట కేసులో విజయ్ కు భారీ షాక్, సీబీఐ అనూహ్య నిర్ణయం..!!
సినీ హీరో... టీవీకే అధ్యక్షుడు విజయ్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ ను వెంటాడుతోంది. తొక్కిసలాట తరువాత ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి. ఇక.. రాష్ట్రంలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ సీబీఐ ఈ కేసు లో అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు విజయ్ కోసం బీజేపీ.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వేళ.. సీబీఐ తాజా నిర్ణయం కీలక మలుపుగా మారుతోంది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేస్తోంది. ఇప్పటికే పలువురు టీవీకే పార్టీ నేతలను విచారణ చేసింది. తాజాగా టీవీకే చీఫ్ విజయ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కు ఈ నెల 12న హాజరు కావాలని నిర్దేశించింది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే చీఫ్ నటుడు విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 41 మందికిపైగా మృతి చెందగా.. పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ విషాదంపై న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జస్టిస్ కె.మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి అంజారియాలకు స్థానం దక్కింది. కాగా, ఇప్పుడు విజయ్ కు సీబీఐ నోటీసు జారీ చేయటం.. ఢిల్లీలో విచారణ చేయనుండటం కీలకంగా మారుతోంది.

ఈ ఘటన తరువాత విజయ్ బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఆర్దిక సాయం చేసారు. తమిళనాడు ప్రభుత్వం సైతం పరిహారం ప్రకటించింది. కాగా, తొలుత ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధురై బెంచ్ విచారణ జరిపింది. ఇక.. కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలను ఇప్పటికే విచారణ చేసింది. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల వేడి క్రమేణా పెరుగుతోంది. తాజాగా అమిత్ షా పర్యటన సమయంలో విజయ్ పైన చర్చ జరిగినట్లు బీజేపీ నేతల సమాచారం. అటు కాంగ్రెస్ సైతం విజయ్ తో మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో సీబీఐ నోటీసులు జారీ చేయటంతో.. విజయ్ తదుపరి నిర్ణయాలు.. రాజకీయంగా కార్యాచరణ పైన ఆసక్తి నెలకొంది.
-
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications