Tweet: ఠాక్రే కోసం దియా మీర్జా ట్వీట్, గ్రహం అంటే బాలీవుడ్ గ్రహమా ?, వివేక్ కౌంటర్, కంగనా !
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల లీడర్ ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి 24 గంటలు కూడా కాకముందే బాలీవుడ్ లో రెండు వర్గాల మద్య సోషల్ మీడియా వార్ మొదలైయ్యింది. దియా మీర్జాకు ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేని పొగిడేస్తూ బాలీవుడ్ నటి కంగనా రౌనత్ మరోసారి వార్తల్లో నిలిచారు.

ఉద్దవ్ ఠాక్రే కోసం ట్వీట్ చేసిన దియా మీర్జా
శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యడంతో విదిలేని పరిస్థితిలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యడంతో మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ సందర్బంలో బాలీవుడ్ నటి దియా మీర్జా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

ఉద్దవ్ ఠాక్రేని ఆకాశానికి ఎత్తేసిన దియా మీర్జా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని ఉద్దేశించి దియా మీర్జా ఇలా ట్వీట్ చేశారు. మీరు ప్రజల కోసం, ఈ గ్రహాల కోసం ఎంతో శ్రద్ద చూపించారు, అందుు మీకు నా ధన్యవాదాలు, మీరు ప్రజాసేవ చెయ్యడానికి రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మళ్లీ అవకాశం వస్తుందని బాలీవుడ్ నటి దియా మీర్జా ట్విట్ చేసి ఆ ట్విట్ కు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రేకి ట్యాగ్ చేశారు.

గ్రహం అంటే బాలీవుడ్ గ్రహమా ?
దియా మీర్జా ట్వీట్ కు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. గ్రహం అంటే బాలీవుడ్ గ్రహమా ? అంటూ ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఉద్దవ్ ఠాక్రేకి మద్దతుగా ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి దియా మీర్జాకు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు బాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసింది.

మీరు నిజంగా చాలా గ్రేట్ సార్
ఇదే సందర్బంలో బాలీవుడ్ నటి కంగనా రౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేని పొగుడుతూ ట్వీట్ చేశారు. మీరే నేటి యువతికి ఎంతో స్పూర్తిధాయకంగా నిలియారని సీఎం ఏక్ నాథ్ షిండేని పొగిడారు. ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఓ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీ కష్టానికి నేడు ఫలితం చిక్కింది సార్ అంటూ బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ట్వీట్ చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications