ఇజ్రాయెల్ ఆర్మీలో ఇద్దరు గుజరాతీ అమ్మాయిలు ! హమాస్ పై పోరులో కీలక పాత్ర..

ఇజ్రాయెల్-హమాస్ గాజా సరిహద్దుల్లో భీకరంగా సాగుతున్న పోరులో భారతీయులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ తరఫున పనిచేస్తున్న వారు ఇప్పుడు హమాస్ ఆటకట్టించే క్రమంలో వార్తల్లోకి వస్తున్నారు. ఇజ్రాయెల్ లో అప్పుడెప్పుడో వెళ్లి స్ధిరపడిన కుటుంబాలకు చెందిన వీరు ఇన్నాళ్లు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు గాజాలో పోరుతో ఒక్కసారిగా తెరపైకి వస్తున్నారు. ఇలా పోరాడుతున్న ఇద్దరు గుజరాతీ యువతులు రియా, నిషాపై ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్నారు.

ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సైనికుల్లో ఇద్దరు గుజరాతీ బిడ్డలు నిషా ములియాసియా, రియా ములియాసియా ఉన్నారు. ఇజ్రాయెల్ , హమాస్ మధ్య శనివారం మొదలైన యుద్ధంలో ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. వీరిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయిలీలు. అదే సమయంలో, దాదాపు 1,100 మంది పాలస్తీనియన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్రమైన సంఘర్షణ మధ్య ఇజ్రాయెల్ ఆర్మీలో పనిచేస్తూ హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న ఈ ఇద్దరు యువతులు వార్తల్లోకి వచ్చారు.

two gujarati girls serving israel army participating in attacks against hamas

గుజరాతీ మూలాలు కలిగిన ఈ ఇద్దరు యువతులు ఇజ్రాయెల్ ఆర్మీలో ఉన్నారు. ఇప్పుడు వారు తమ ప్రతిభాపాటవాలు నిరూపించుకునే సమయం వచ్చింది. గుజరాత్ కు చెందిన జీవాభాయ్ ములియాసియా మరియు సావ్దాసభాయి ములియాసియా బంధువులు. ఈ ములియాసియాలు గుజరాత్ లోని జునాగఢ్‌లోని మానవ్దార్ తాలూకాలో కొతాడి గ్రామ వాసులు. చాలా సంవత్సరాల క్రితం వీరి కుటుంబం ఇజ్రాయెల్‌లో స్థిరపడింది. వీరు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో కిరాణా దుకాణం నడుపుతున్నారు.

వీరి కుమార్తెలు నిషా ములియాసియా , రియా ములియాసియా ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ లో తప్పనిసరి సైనిక సేవా విధానంలో భాగంగా వీరిద్దరూ సైన్యంలో చేరారు. ఇజ్రాయెల్ విద్యావిధానం పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని వీరి తండ్రి చెప్తున్నారు. నిషా రెండేళ్లుగా లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్‌పై దాడి చేస్తున్న యుద్ధభూమి అయిన గుష్ డెన్‌లో పనిచేస్తోంది.

ఇజ్రాయెల్‌లో పెద్ద సంఖ్యలో గుజరాతీ ప్రజలు నివసిస్తున్నారు. వ్యాపారం, విద్య, ఉపాధి ఇలా రకరకాల కారణాలతో వీరంతా ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. ఇజ్రాయెల్‌ చట్టాల ప్రకారం మగ, ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కనీసం 24 నుండి 32 నెలల పాటు సైన్యంలో పనిచేయాలి. దీంతో భారత్ నుంచి వెళ్లిన ములియాసియా కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు రియా, నిషా సైన్యంలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+