చత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్‌లు మృతి చెందినట్లుగా టీవీ ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో సిఆర్పీఎఫ్ బెటాలియన్, జిల్లా రిజర్వ్ గ్రూప్ కలిసి ఆపరేషన్ నిర్వహించినట్లు బసారా రేంజ్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్సార్పీ కల్లూరి చెప్పారు. తమకు మావోయిస్టుల కదలకల పైన సమాచారం వచ్చిందని, దీంతో ఆపరేషన్ నిర్వహించామన్నారు.
స్థానిక మావోయిస్టు దళ కమాండర్ హిద్మా తదితరులు ఓ పెళ్లి వేడుకకు వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో హిద్మాను అదుపులోకి తీసుకునేందుకు తాము సిద్ధమయ్యామని చెప్పారు.












Click it and Unblock the Notifications