కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాఠశాలలో కాల్పులు జరిపిన విద్యార్థులు: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

|
Google Oneindia TeluguNews

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాలలో ఓ విద్యార్థి, అతడి టీనేజి సోదరుడు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. పాఠశాలలో రెండు గ్రూపుల మధ్య తాగాదా, ఘర్షణలతో వారు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు.

అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

Two teenagers open fire in Muzaffarnagar school

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బిజ్నోర్ జిల్లా ధామ్‌పూర్ వద్ద ట్రక్కు-వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మొరాబాద్‌కు చెందిన వీరు వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ధామ్‌పూర్ పోలీసు అధికారి హరేంద్ర యాదవ్ వెల్లడించారు. వ్యాన్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు చెప్పారు.

పెళ్లి వ్యాను బోల్తా..15 మందికి గాయాలు

కరీంనగర్: జిల్లాలోని కోరుట్ల శివారులో ఓ పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను రుద్రాంగి నుంచి మందమర్రి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

English summary
A student and his teenage brother allegedly opened fire in a school here following which they were arrested, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X