బ్యాంకు దోపిడీకి వస్తే దుమ్ములేపిన మహిళా ఉద్యోగులు: సినిమానే (వీడియో)

బ్యాంకు దోచుకోవడానికి వచ్చిన ఇద్దరు యువకులను అదే బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు చేతికి చిక్కిన వస్తువులు తీసుకుని చితకబాది దేహశుద్ది చేసి స్థానికులకు అప్పగించిన ఘటన హరియాణాలోని గుర్ గ్రామ్.

గుర్ గ్రామ్: బ్యాంకు దోచుకోవడానికి వచ్చిన ఇద్దరు యువకులను అదే బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు చితకబాది స్థానికులకు అప్పగించిన ఘటన హరియాణాలోని గుర్ గ్రామ్ లో జరిగింది. బ్యాంకు ఉద్యోగినులు ప్రాణాలకు తెగించి సాహసం ప్రదర్శించారు.

గుర్ గ్రామ్ లోని ఓ బ్యాంకును దోచుకోవడానికి ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఒకడు బ్యాంకులో ఏమీ తెలీనట్లు ఏదో ఫారం నింపుతున్నట్లు నటిస్తూ కర్చీలో కుర్చోన్నాడు. మరొకడు వెనుక బ్యాగ్ తగిలించుకుని బ్యాంకులోకి వచ్చాడు.

తరువాత కుర్చీలో కుర్చోన్న అతడితో మాట్లాడి బ్యాగ్ తెరచి అందులో ఉన్న కత్తిని అవతలి వ్యక్తికి ఇచ్చాడు. అతను మాత్రం రివాల్వర్ తీసుకుని చేతిలో పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక్క సారిగా క్యాష్ కౌంటర్ మీద పడి బ్యాంకు సిబ్బందిని బెదిరించారు.

రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి బెదిరిస్తుండగానే వెంటనే కత్తి పట్టుకున్న వ్యక్తి బ్యాంకు సిబ్బందిపై దాడి చేశారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మహిళా ఉద్యోగులు ఇద్దరూ వారిని పట్టుకున్నారు.

బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు మూసివేసి అడ్డంగా నిలబడ్డారు. అదే సమయంలో బయట నుంచి వచ్చిన స్థానికులు చేతికి చిక్కిన వస్తువులు, కుర్చీలు తీసుకుని ఇద్దరు దొంగలకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం తతంగం బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+