డ్రైవర్ నిద్రపోతే ప్యాసింజర్ క్యాబ్ నడిపాడు
న్యూఢిల్లీ: విశ్రాంతి లేకుండా కారు నడుపుతున్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్యాసింజర్ ను పిలుచుకుని వెలుతూ కారులోనే నిద్రపోయాడు. కారు కాస్త రోడ్డు డివైడర్ ను ఢీకొనింది. చేసిదిలేక ఆ ప్యాసింజర్ డ్రైవర్ ను పక్కసీట్లో కుర్చోపెట్టి ట్యాక్సీ నడుపుకుంటూ ఇంటికి వెళ్లాడు.
ప్యాసింజర్ మంచి వాడు కావడంతో ఉబర్ డ్రైవర్ పరిస్థితి అర్థం చేసుకుని కేసు పెట్టలేదు. పైగా అతనికి ట్యాక్సీ అద్దె చెల్లించాడు. డ్రైవర్ నిద్రపోతున్న విషయం, అతనికి డబ్బులు ఇచ్చినా తీసుకోలేని పరిస్థితిలో న్న విషయం మొబైల్ లో చిత్రీకరించిన ప్యాసింజర్ దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఫైనాన్సియల్ అనలిస్టుగా పని చేస్తున్న గిల్ అనే వ్యక్తి దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ నుంచి డీఎల్ఎఫ్ సెంకడ్ స్టేజ్ లోని తన ఇంటికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కారు వచ్చిన తరువాత అందులో కుర్చుని ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో డ్రైవర్ నిద్రపోయాడు. కారు రోడ్డు డివైడర్ ను ఢీకొనింది.
డ్రైవర్ ను ఎంత లేపినా అతను నిద్రలేవలేదు. డ్రైవర్ ను పక్కసీట్లో కుర్చోపెట్టిన గిల్ అతనే కారు నడుపుకుంటూ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. డ్రైవర్ కు డబ్బులు ఇచ్చినా అతను తీసుకునే పరిస్థితిలో లేడని, అతని జోబులో రూ. 500 పెట్టి వెళ్లానని గిల్ అంటున్నారు. నిద్ర రాకుండా మాత్రలు వేసుకోవడం వలన తల తిరిగిందని అందుకే ఇలా జరిగిందని క్యాబ్ డ్రైవర్ చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications