శివ కుమార్ యాదవ్ అబద్ధాల్లో మాస్టర్: ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో 27 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్ అబద్ధాల్లో ఆరితేరినవాడని, మోసపూరితమైన వ్యక్తి అని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. 32 ఏళ్ల యాదవ్ సీరియల్ రేపిస్టు అని అంటున్నారు. 2013లో జరిగిన రేప్ కేసులో అతనికి బెయిల్ వచ్చింది. 2011లో అదే విధమైన కేసులో శిక్ష కూడా అనుభవించాడు.

చాలా విషయాలను యాదవ్ దాస్తున్నాడని, ఏవైతే బయటకు వచ్చాయే ఆ విషయాలను మాత్రమే అంగీకరిస్తున్నాడని, గతంలోని సంఘటనల గురించి అడిగితే ఎల్బీలు చూపిస్తున్నాడని, వాటిలో వేటిలోనూ తాను దోషిని కానని చెబుతున్నాడని పోలీసులు అంటున్నారు.

మూడు అత్యాచారం కేసుల్లో నిందితుడు, ఓ కేసులో అసభ్య ప్రవర్తన అనే విషయాలు వెలుగు చూశాయి. క్యాబ్ డ్రైవర్‌గా అటువంటి సంఘటనలకు ఇంకేమైనా పాల్పడ్డాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అతను వివరాలు ఇవ్వడం లేదని అంటున్నారు. అడిగితే లేదంటూ శరీర కదలికల ద్వారా చెబుతున్నాడే తప్ప నోరు మెదపడం లేదని అంటున్నారు.

Uber driver Shiv Kumar Yadav 'master of lies', says Delhi police

శివ కుమార్ యాదవ్ గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులను సంప్రదించారు. ఢిల్లీ పోలీసులు యాదవ్‌పై మరో రెండు వారాల్లో వాటర్ రైట్ అభియోగం మోపాలని చూస్తున్నారని, అందుకు పాత క్రిమినల్ రికార్డు వారికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనికోసం ఢిల్లీ నార్త్ డిప్యూటీ పోలీసు కమిషనర్ మాధుర్ వర్మ మైనపురి ఎస్ఎస్పీతో మాట్లాడారు. పత్రాలను తీసుకోవడానికి ఓ పోలీసు బృందం మైనపురి వెళ్తోంది.

మిడిల్ స్కూల్ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్‌పురిలో చదివిన యాదవ్ అక్కడ ఓ మహిళపై నిరుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో రెండు కేసులతో కూడా అతనికి సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు. 2011లో దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో అత్యాచారం కేసులో అతను అరెస్టయి, కొంత కాలం జైల్లో ఉన్నాడు. అయితే, అతను ఈ కేసు నుంచి బయటపడ్డాడు. మైన్‌పురిలో గూండా చట్టం కింద రెండు కేసులున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+