థాక్రేలు కలుస్తున్నారా లేదా ? ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విస్ట్..!
మహారాష్ట్ర రాజకీయాల్లో థాక్రేల శకం ముగిసినట్లేనని అనుకుంటున్న తరుణంలో తాజాగా ఉధ్దవ్, రాజ్ థాక్రేలు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. పరస్పరం కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ తప్పదనే చర్చ మొదలైంది. థాక్రేలు ఇద్దరూ కలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ థాక్రేల కలయికపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
థాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ ల కలయికపై స్పందిస్తూ ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్..ప్రస్తుతానికి ఇద్దరి మధ్య పొత్తు కానీ కూటమి కానీ లేదని, కేవలం భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. అయితే, మహారాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు నాయకులు చేతులు కలిపే అవకాశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు. భవిష్యత్తులో పొత్తు చర్చల బాధ్యత ఇద్దరు సోదరులపైనే ఉందని కూడా వెల్లడించారు.

రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులని తాము చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నామని సంజయ్ రౌత్ తెలిపారు. తమ సంబంధం తెగిపోలేదన్నారు. ఇద్దరు సోదరులు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని రౌత్ వెల్లడించారు. ఉద్ధవ్ చెప్పిన దాని ప్రకారం మహారాష్ట్ర కోసం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటే రాజ్ తో కలిసి పనిచేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా రాజ్ థాక్రే..బాలీవుడ్ నిర్మాత మహేష్ మంజ్రేకర్‌తో మాట్లాడుతూ తనకు మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవని, మిగతావన్నీ చిన్నవేనని తెలిపారు. తమ చిన్న వివాదాలను తాను పక్కన పెట్టగలనంటూ హింట్ ఇచ్చారు. తాను ఉద్ధవ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ అతను కూడా నాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది మాత్రమే ప్రశ్న అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన సోదరుడు, ఉద్ధవ్ థాక్రే.. తన సోదరుడిని సంప్రదించి, తమ విభేదాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications