హోలీ వేళ.. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతిలో మంటలు: 14మందికి గాయాలు!!
హోలీ పండుగ వేళ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం శ్రీ మహాకాళేశ్వర్ లో హోలీ పర్వదినాన్ని చాలా ఘనంగా జరుపుతారు.ఈ క్రమంలోనే నేడు హోలీ సందర్భంగా నిర్వహించిన భస్మ హారతిలో గర్భగుడిలో ప్రమాదం చోటు చేసుకోగా, ప్రధాన పూజారితో సహా 14 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో నేడు ఉదయం గర్భగుడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోలీ వేడుకలలో భాగంగా భస్మ హారతి నిర్వహిస్తున్న సమయంలో, గులాల్ ఊదటంతో మంటలు చెలరేగి 14 మంది గాయపడ్డారు. భస్మహారతి నిర్వహిస్తున్న పూజారి సంజీవ్ పై వెనకనుంచి ఎవరో గులాల్ పోయడంతో, అందులో రసాయనాలు ఉండడంతో ఒక్కసారిగా గులాల్ హారతి ఇస్తున్న దీపం మీద మీద పడి మంటలు చెలరేగాయి.

ఈ మంటలలో అక్కడ పూజలు నిర్వహిస్తున్న 14 మంది గాయపడ్డారని తెలుస్తుంది. ఒక్కసారిగా మంటలు గర్భగుడిలో వ్యాపించటంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అక్కడ మంటలను అదుపులోకి తెచ్చారు. గర్భగుడిలోనే ప్రమాదం జరగడంతో లోపల ఉన్న పూజారులు తప్పించుకోలేక పోయారు. ప్రస్తుతం గాయపడిన పూజారులు అందరిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటనపై స్పందించిన ఉజ్జయిని జిల్లా కలెక్టర్ నీరజ్ సింగ్ గాయపడిన వారందరిని ఆసుపత్రిలో చేర్పించామని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు వచ్చాయని, కమిటీ విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించనుందని తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు వైభవ్ యాదవ్ కూడా ఆలయంలోనే ఉన్నారు. మహాకాళేశ్వరుడి దయవల్ల ఎవరికి ప్రాణహాని జరగలేదని, ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | Ujjain, Madhya Pradesh | 13 people injured in a fire that broke out in the 'garbhagriha' of Mahakal Temple during bhasma aarti today. Holi celebrations were underway here when the incident occurred. The injured have been admitted to District Hospital.
— ANI (@ANI) March 25, 2024
(Earlier visuals… pic.twitter.com/cIUSlRirwo
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications