India Name Change : భారత్ పేరు మార్పుపై ఐరాస స్టాండ్ ఇదే !
ఇండియా పేరును కేంద్రం త్వరలో భారత్ గా మార్చబోతున్నట్లు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజాగా జీ20 సదస్సు విందు కోసం అతిధులకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొనడం, అంతకుముందు బ్రిక్స్ సమావేశం, తాజాగా ఆసియాన్ సదస్సులో అతిధులకు సైతం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపడంతో ఈ వాదన నిజమేనన్న చర్చ సాగుతోంది. అయితే కేంద్రం మాత్రం ఇవి వదంతులే అని చెప్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు.
త్వరలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కూడా ఈ వార్తలపై స్పందించింది. భారత్ పేరు మార్పు జరిగితే ఐక్యరాజ్యసమితితో పాటు అన్ని దేశాలకూ ఈ సమాచారం ఇవ్వడంతో పాటు అన్ని అధికారిక పత్రాల్లోనూ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల సంగతి ఎలా ఉన్నా ఐరాస మాత్రం తన అభిప్రాయం చెప్పింది.

ఏదైనా దేశం పేరు మార్చమనే అభ్యర్ధన వస్తే తప్పకుండా దాన్ని స్వీకరించి ఆమోదిస్తామని ఐక్యరాజ్యసమితి తాజాగా పేర్కొంది.ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ ఈ ప్రకటన చేశారు. టర్కీ తన పేరును టర్కీయేగా మార్చిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. అలాగే ఇండియా కూడా పేరు మార్చుకుంటే దాన్ని ఆమోదిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇండియా పేరు మార్పుపై ఐరాస నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని తేలిపోయింది.
టర్కీయే విషయంలో, ప్రభుత్వం అందించిన అధికారిక అభ్యర్థనకు తాము ప్రతిస్పందించామమని, సహజంగానే తమకు అలాంటి అభ్యర్థనలు వస్తే అవి వచ్చినవి వచ్చినట్లు తాము వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్చవచ్చనే నివేదికలపై ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇండియా పేరు మార్పుపై భారత్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఐరాస స్పందన కీలకంగా మారింది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications