కేంద్రమంత్రి కుమారస్వామికి అస్వస్థత: ముక్కు నుంచి రక్తం

బెంగళూరు: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారడం ఆందోళనకు గురిచేసింది. రక్తం కారడంతో చేతిరుమాలుతో అడ్డుపెట్టారు కుమారస్వామి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు.

వచ్చే వారం ప్రారంభం కానున్న బీజేపీ-జేడీఎస్ పాదయాత్రకు సంబంధించి బెంగళూరులోని ఓ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారడం, చొక్కాపై రక్తపు మరకలతో ఉన్న దృశ్యాలు ప్రసార మాధ్యమాలతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Union Minister Kumaraswamy is unwell after Bleeding from the nose

ఈ దృశ్యాలు చూసిన జేడీఎస్ నేతలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం కుమారస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కుమారస్వామికి వైద్యులు అందిస్తున్న చికిత్సు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

కాగా, ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ.. తన తండ్రికి వైద్యులు చికిత్స అందిస్తున్నందున ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. తండ్రి తన తీవ్రమైన షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకోలేదని, ఈ సంఘటన వెనుక కారణం కావచ్చని నిఖిల్ చెప్పారు.

కాగా, బీజేపీ-జేడీఎస్ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి మైసూర్ వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 3న ప్రారంభం కానున్న ఈ యాత్ర 10 వరకు కొనసాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+