Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభుత్వం పనికిమాలినది, నడుస్తున్న బండికి పంక్చర్ చేస్తుంది: కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయాల స్వభావం, అభివృద్ధి, అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై తనదైన శైలిలో నిర్మొహమాటంగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా క్రీడారంగంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరిస్తూ, ప్రభుత్వ వ్యవస్థల అసమర్థతను ఎత్తి చూపారు.

ఉచితాల సంస్కృతి వద్దు.. ఫీజులు తప్పనిసరి
గడ్కరీ తన ప్రసంగంలో "ఉచితాల మార్కెట్"‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, శిక్షణ వంటి వాటికి ఫీజులు తీసుకోవడం అవసరమని, ఉచితంగా ఏమీ నేర్పకూడదని స్పష్టం చేశారు. "నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇక్కడ అంతా ఉచితంగా కావాలని ప్రజలు కోరుకుంటారు, కానీ నేను ఉచితంగా ఏమీ ఇవ్వనని ఆయన తన దృఢ నిబద్ధతను చాటారు. ప్రభుత్వ పథకాలు, సేవలలో ఉచితాల సంస్కృతిని ప్రోత్సహించడం వల్ల వాటి విలువ తగ్గుతుందని, స్వయం సమృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన నమ్ముతున్నట్లు ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

Union Minister Nitin Gadkari s Bold Remarks criticized the inefficiency of government machinery

రాజకీయం ఒక వ్యసనం, అధికారం క్షణికం

గడ్కరీ కేవలం రాజకీయాలపైనే కాకుండా, దాని స్వభావంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. "రాజకీయం ఒక వ్యసనం లాంటిది అని, ఆ వ్యసనంలో కూరుకుపోయినప్పుడు మనిషి ఆలోచనా శక్తిని కోల్పోతాడని అన్నారు. "అధికారం, సంపద, అందం - ఇవన్నీ శాశ్వతం కావు, క్షణికమైనవని జీవిత సత్యాలను ఉద్ఘాటించారు. మంచి రోజుల్లో పొగిడేవారు ఎక్కువ మంది ఉంటారని, కానీ కష్టకాలంలో పలకరించేవారు కూడా ఉండరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ జీవితంలోని అనిశ్చితిని, మానవ సంబంధాల వాస్తవికతను ఆయనకు స్పష్టంగా అర్థమైందని తెలియజేస్తుంది.

ప్రభుత్వం పనికిమాలినది.. కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర విమర్శలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన అత్యంత సంచలనాత్మక వ్యాఖ్యలో ఒకటి.. "ప్రభుత్వం చాలా పనికిమాలినది". నాగ్‌పూర్‌లో 300 క్రీడా స్టేడియాలు నిర్మించాలనే తన ఆకాంక్షను ప్రస్తావిస్తూనే, "నా నాలుగేళ్ల అనుభవం తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, కార్పొరేషన్ల మీద నమ్మకంతో ఏ పనీ జరగదు. వీరు నడుస్తున్న బండికి పంక్చర్ చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారని స్థానిక ప్రభుత్వ సంస్థలైన కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ విభాగాల నిదానమైన, అసమర్థమైన పనితీరు, బ్యూరోక్రాటిక్ అడ్డంకులు ప్రాజెక్టుల అమలును ఎలా అడ్డుకుంటాయో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి.

క్రీడా రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం
ప్రభుత్వ యంత్రాంగంపై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాన్ని గడ్కరీ సూచించారు. దుబాయ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త క్రీడా మైదానాలను విజయవంతంగా నడుపుతున్న విధానం నుంచి స్ఫూర్తి పొందనట్లు వెల్లడించారు. అదే తరహాలో, "మేము టెండర్ వేసి 15 సంవత్సరాల పాటు స్థలాన్ని అందిస్తాం, లైట్లు, గ్యాలరీలు వంటి మౌలిక సదుపాయాలన్నీ నిర్మిస్తాం. అయితే లాన్ నిర్వహణ వారిదే అవుతుంది, ఆ ప్రాంతం ప్రకారం క్రీడలు నిర్వహిస్తారు," అని వివరించారు. ఈ క్రీడా సౌకర్యాలను ఉపయోగించుకునే ఆటగాళ్ల నుండి కనిష్ట ఫీజు (₹500-₹100) వసూలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) ద్వారా క్రీడా రంగంలో మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఆయన ఆశయానికి నిదర్శనం.

నేను ఆర్థిక నిపుణుడిని.. డబ్బు లేకుండానే పనులు చేయగలను..
తనను తాను ఆర్థిక సలహాదారునిగానో, చార్టెడ్ అకౌంటెంట్‌గానో కాకుండా, "ఖచ్చితంగా ఆర్థిక నిపుణుడిని" అని గడ్కరీ తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. "ఐదు లక్షల కోట్ల రూపాయల పనులను డబ్బు ఇవ్వకుండానే నేను చేయగలను. ఏ పనిని ఎలా పూర్తి చేయాలో నాకు తెలుసు," అని ఆయన తన నైపుణ్యాన్ని, కార్యదక్షతను తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో, అమలు చేయడంలో తనకున్న అనుభవం, వినూత్న పద్ధతులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. విద్యా శాఖలో అవినీతిపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ, అవినీతిపై తన పోరాట వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

యువతకు నిజాయితీ, కష్టపడే తత్వంపై సందేశం
తన ప్రసంగం ముగింపులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్నిచ్చారు. ఏ రంగంలోనైనా నిజాయితీగా, కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు.కష్టకాలంలో ఎవరూ తోడు ఉండరని ఆయన యువతకు ఆత్మవిశ్వాసం, నిజాయితీతో కృషి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. గడ్కరీ వ్యాఖ్యలు కేవలం ప్రభుత్వ విమర్శలుగా కాకుండా, పాలనలో సంస్కరణలు, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+