క్రికెట్ కంటే ఏఏపీనే ఎంటర్టైన్మెంట్: కేజ్రీవాల్‌పై అగ్నివేష్ బాంబు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీలోని రాజకీయం ఢిల్లీ డేర్ డెవిల్స్ కంటే ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 8లో భాగంగా ఆడుతున్న డేర్ డెవిల్స్ కంటే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ రాజకీయాలతోనే ఢిల్లీ ప్రజలు ఎక్కువగా ఆనందిస్తున్నారట!
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ గెలుచుకుంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, అప్పటి నుండే ఏఏపీలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది.
అది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఏఏపీ మద్దతుదారులు.. తాము గతంలో ఇచ్చిన కారు వెనక్కి ఇవ్వాలని, తాను రూపొందించిన ఏఏపీ లోగోను ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు.

తాజాగా స్వామి అగ్నివేష్ మరో బాంబు పేల్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన గురువు అయిన హజారేను చంపాలని భావించారని చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి! దీనిపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.
2011లో రాంలీలా మైదానంలో అన్నా హజారే దీక్షకు దిగినప్పుడు ఇది జరిగిందని అగ్నివేష్ చెప్పారని తెలుస్తోంది. నాడు ప్రభుత్వం హజారే పెట్టిన డిమాండ్లకు నాలుగో రోజే అంగీకరించింది. అయితే, కేజ్రీవాల్ మాత్రం.. మరో పది రోజులు నిరాహార దీక్ష చేయాలని హజారేపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తద్వారా కేజ్రీవాల్ తన ప్రయోజనం ఆశించారని ఆరోపించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications