అమానుషం... అప్పుడే పుట్టిన పసికందు నోటికి ప్లాస్టర్.. చెరువులో విసిరేసిన దుర్మార్గులు
బిహార్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. పుట్టి ఒక్కరోజు కూడా గడవని ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఓ నీటి గుంటలో పడేశారు. శిశువు ఏడవకుండా నోటికి ప్లాస్టర్ వేసి... ప్లాస్టిక్ బ్యాగులో కుక్కేశారు. అయితే అదృష్టవశాత్తు ఆ శిశువు నోటికి వేసిన ప్లాస్టర్ ఊడిపోవడంతో... ఆ పసికందు ఏడుపు విని స్థానికులకు వినిపించింది. దీంతో ఆ శిశువును చేరదీసి సమీప ఆస్పత్రికి తరలించారు.బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం(అగస్టు 9) తెల్లవారుజామున 5గంటల సమయంలో ఆశాదేవి అనే ఓ మహిళ పశువులకు మేత వేసేందుకు పశువుల కొట్టం వద్దకు బయలుదేరింది. మార్గమధ్యలో ఓచోట ఆమెకు పసికందు ఏడుపు వినిపించింది. సమీపంలోని ఓ నీటి కుంట నుంచి ఆ ఏడుపు రావడం గమనించింది. దీంతో దగ్గరికి వెళ్లి పరిశీలించింది. ఆ నీటి కుంటలో ఓ ప్లాస్టిక్ సంచి ఉండటంతో దాన్ని బయటకు తీసింది. అందులో ఉన్న నవజాత శిశువును చూసి షాక్ తిన్నది.

ఆ శిశువు నోటికి ప్లాస్టర్ వేయగా అది ఊడిపోయినట్లు గమనించింది. ఒకవేళ ఆ ప్లాస్టర్ ఊఢిపోకపోతే ఆ శిశువు ప్రాణాలు దక్కి ఉండకపోయేవేమో. వెంటనే ఆశాదేవి చుట్టుపక్కలవాళ్లకు సమాచారం అందించింది. దీంతో ఆ పసికందును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ శిశువును నీళ్లలో పడేసిన కొద్దిసేపటికే ఆశాదేవి గుర్తించి ఉంటుందని... ఒకవేళ ఎక్కువసేపు అయి ఉంటే ఆ శిశువు గుక్కపెట్టి ఏడ్చి చనిపోయేదని వైద్యులు పేర్కొన్నారు. ఆడ శిశువు కావడంతోనే ఇలా పారేసి ఉంటారని అన్నారు.
ఓవైపు కేంద్ర ప్రభుత్వం భేటీ పడావో భేటీ బచావో వంటి కార్యక్రమాలతో ఆడపిల్లలను ప్రోత్సహించే పథకాలు చేపడుతుంటే... మరోవైపు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండం అత్యంత శోచనీయం.
ఇప్పటికీ చాలామంది ఆడపిల్ల పుట్టిందంటే అదొక అవమానమని భావించేవారు సమాజంలో చాలామందే ఉన్నారు. వాళ్లలో మార్పు రానంతవరకు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. పసికందుల పట్ల ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications