వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం యోగిలానే వచ్చాడు!: పూల వర్షం కురిసింది(వీడియో)

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వేషంలో వచ్చి సంచల

|
Google Oneindia TeluguNews

వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వేషంలో వచ్చి సంచలనంగా మారాడు.

మార్చి 29న ఓ కార్యక్రమం సందర్భంగా ఓ వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌లా కాషాయ రంగు దుస్తులు వేసుకుని కారులో వచ్చాడు. అతనితో పాటు గన్‌మెన్‌ కూడా ఉండటంతో సీఎం వచ్చారనుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడి ప్రజలు కూడా అతను ఆదిత్యనాథే అనుకుని కారుపై పూల వర్షం కురిపించారు.

తీరా చూస్తే అతను యోగి ఆదిత్యనాథ్‌ కాకపోగా అతని చుట్టూ ఉన్న వారు కూడా నకిలీ గన్‌మెన్లని తెలిసి పోలీసులు కూడా కంగుతిన్నారు. ఓ సామాన్య వ్యక్తి సీఎంని అనుకరించడం నిబంధనలు అతిక్రమించినట్లు అవుతుందని అతనిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

English summary
A video showing a man acting like the newly-elected Uttar Pradesh Chief Minister Yogi Adityanath, and others acting like his security personnel, in Varanasi, caught a lot of eyeballs on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X