వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ ఎలక్షన్స్ 2017: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.90 శాతం పోలింగ్

ఉత్తర్ ప్రదేశ్ లో తొలి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో మొదలైంది. 15 జిల్లాల్లోని 73 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.56 శాతం పోలింగ్ నమోదైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లఖ్ నవూ: ఉత్తర ప్రదేశ్ లో తొలి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో మొదలైంది. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లల్లోని 73 స్థానాలలో పోలింగ్ జరుగుతోంది. యూపీలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. బీజేపీ, బీఎస్పీలు విడివిడిగా పోటీ పడుతున్నాయి.

తొలి దశలో 2.57 కోట్ల మంది ఓటర్లు 839 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు.

up polling scene

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముజఫర్ నగర్ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్ పై ప్రభావం చూపే అవకాశముంది. యూపీలో మొత్తం 403 నియోజక వర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు వెలువడనున్నాయి.

పోటీలో ఉన్న ప్రముఖులు వీరే...

పంకజ్ సింగ్ - నోయిడా ( కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కుమారుడు )
ప్రదీప్ మాధూర్ - మథుర ( సీఎల్పీ నేత )
లక్ష్మీకాంత్ బాజ్ పేయి - మేరఠ్ ( బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు )
రాహుల్ సింగ్ - సికందరాబాద్ ( ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు )
సందీప్ సింగ్ - అత్రౌలి ( రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ మనుమడు )

ముజఫర్ నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

పోలింగ్ తీరుతెన్నులు, విశేషాలు...ఉదయం 7.05 - ఉత్తర ప్రదేశ్ తొలి విడత ఎన్నికల ఓటింగ్ మొదలైంది.

ఉదయం 6.40 - యూపీలోని పోలింగ్ బూత్ ల వద్ద అక్కడి ఓటర్లు బారులు తీరారు.

6.50 - కాసేపట్లో ప్రారంభం కానున్న తొలి విడత పోలింగ్.

7.05 - ఉత్తర ప్రదేశ్ తొలి విడత ఎన్నికల ఓటింగ్ మొదలైంది.

7.15 - సమస్యాత్మక ప్రాంతమైన దాద్రిలో పోలింగ్ ప్రశాంతంగానే ప్రారంభమైంది.

7.20 - నోయిడా సెక్టార్ లోని 15ఎ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మొదలు.

7.25 - గ్రేటర్ నోయిడా లోని భట్టా పరసౌక్ ప్రాంతంలోని పోలింగ్ బూత్ లలో కనీస సౌకర్యాలు కూడా లేవని మహిళా పోలింగ్ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు.7.30 - మీడియా కథనాల ప్రకారం.. మధుర లోని గోవర్ధన్ ప్రాంతంలో ఉన్న బూత్ నంబర్ 42లో ఈవీఎంల మొరాయింపు వల్ల పోలింగ్ ఆలస్యంమైంది. భాగ్ పట్ లోని 119, 120 నంబర్ పోలింగ్ బూత్ లలో కూడా ఇదే సమస్య ఎదురైంది.

7.40 - ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పోలింగ్ బూత్ ల బయట ఇంకు గుర్తు ఉన్న వేలిని మీడియా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు.7.50 - యూపీలో తొలి విడత పోలింగ్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు కనిపిస్తోంది.

8.00 - మధుర నియోజకవర్గంలో బీజేపీ తరుపున పోటీలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ శర్మ ఓ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

8.10 - ఎలక్షన్ కమిషన్ వివరాల ప్రకారం.. ఎథస్ జలేసర్ యూపీలో అత్యంత చిన్న నియోజక వర్గం.

8.20 - బులంద్ షహర్ లోని ఓ పోలింగ్ కేంద్రం బయట.. తమ ఓటుహక్కు ను వినియోగించుకున్న అనంతరం వేలికి ఉన్న ఇంకు గుర్తును చూపుతున్న యువతులు.8.31 - ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దానిని ఉపయోగించుకోవాలంటూ ఉత్తరప్రదేశ్ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు.

8.34 - అమూల్యమైన ఓటు వేయడం ద్వారా తమ పార్టీని ఎన్నికల్లో గెలిపించాలంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు.

8.41 - ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

8.44 - ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం.. ఘజియాబాద్ లోని సహిబాబాద్ యూపీలోని అతిపెద్ద నియోజక వర్గం.8.45 - భాగ్ పట్ జిల్లా బారౌట్ ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ అధికారులు గులాబీ పువ్వును అందజేశారు.

8.54 - ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న నియోజక వర్గాలలో భారీ భద్రత కనిపిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అడుగడుగునా పోలీసులు కనిపిస్తున్నారు.

9.20 - సర్దానా సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్ కేంద్రం బయట విజయ చిహ్నాన్ని చూపారు.

9.31 - ఉదయం 9 గంటల వరకు బులంద్ షహర్ లో 12 శాతం, అలీగఢ్ లో 10.5 శాతం పోలింగ్ నమోదైంది.

9.38 - ముజఫర్ నగర్ నియోజక వర్గంలో ఉదయం 9 గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.10.03 - ఉదయం 9 గంటల వరకు పోలైన ఓట్ల శాతం... ప్రాంతాల వారీగా..

మధుర - 9%, గ్రేటర్ నోయిడా - 8.9%, కస్ గంజ్ - 12.5%, మీరట్ - 11%, ముజఫర్ నగర్ - 15%, ఘజియాబాద్ - 13%, హత్రస్ - 11%, భాగ్ పట్ - 8%, ఫిరోజాబాద్ - 12%, హాపూర్ - 10%,
షామిలి - 18%, అలీగఢ్ - 9%, ఆగ్రా - 12.8%

10.10 - యూపీ తొలి విడత పోలింగ్ లో ఉదయం 9 గంటల వరకు 10.56 శాతం ఓటింగ్ నమోదైంది.

10.20 - మీరట్ జిల్లాలోని సర్దానా పట్టణంలోని ఓ పోలింగ్ బూత్ లోనికి చేతిలో పిస్టల్ తో ప్రవేశించిన బీజేపీ అభ్యర్థి సంగీత్ సోమ్ తమ్ముడు గగన్ సోమ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

10.28- కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా లక్నోలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

10.34 - కోటి నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.1000 పెన్షన్ ఇవ్వనున్నట్లు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అలాగే అన్ని గ్రామాల్లో వచ్చే అయిదేళ్లలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇంకా.. రూ.10కే ఆహారం, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు.10.44 - ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు : రాహుల్ గాంధీ

10.48 - దేశ భద్రత, ఉద్యోగావకాశాలు, నిరుద్యోగంపై ప్రధాని సరైన సమాధానం ఇవ్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు : రాహుల్ గాంధీ

11.00 - ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని ప్రధాని సహించలేకపోతున్నారు.. మరీ అంత ఆగ్రహం పనికి రాదు : సీఎం అఖిలేష్ యాదవ్

11.10 - ఇతరుల బాత్రూం లోకి తొంగిచూడడం ప్రధాని మోడీకి ఇష్టం లాగుంది : రాహుల్ గాంధీ ఎద్దేవా

11.20 - ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కాన్పూర్, గోరఖ్ పూర్, బరేలీ కి చెందిన అన్ని ఎమ్మెల్సీ సీట్లను బీజేపీయే గెలుచుకుంది.

11.45 - యూపీలో కేవలం బీఎస్పీ మాత్రమే ఉత్తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు : మాయావతి

11.47 - తొలి విడత పోలింగ్ లో ప్రజలు మా పార్టీకే మొగ్గు చూపుతున్నట్లు, బీఎస్పీకే అధిక ఓట్లు పోలవుతున్నట్లు నాకు సమాచారం అందుతోంది: మాయావతి

11.52 - ఉదయం 11 గంటల వరకు ఆగ్రాలో 28.76 శాతం, నోయిడాలో 20 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

12.00 - షామిలిలో ఉదయం 11 గంటల వరకు 29 శాతం ఓట్లు పోలయ్యాయి.

12.19 - ఉదయం 11 గంటల వరకు యూపీలో మొత్తం 11 శాతం పోలింగ్ జరిగింది.

01.23 - మధ్యాహ్నానికి పోలింగ్ శాతం 30కి చేరింది.

01.36 - ఉత్తర ప్రదేశ్ లోని బుడాన్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

01.42 - మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతం ఇలా ఉంది. ముజఫర్ నగర్ లో 42 శాతం, షామిలిలో 46 శాతం, ఫిరోజాబాద్ లో 41.8 శాతం.

01.48 - యూపీ తొలి విడత ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలైన మొత్తం ఓట్లు 39.43 శాతం.3.42 - యూపీలోని 73 అసెంబ్లీ నియోజక వర్గాలలో తొలి విడత పోలింగ్ లో మధ్యాహ్నం 2 గంటల వరకు 45 శాతం పోలింగ్ నమోదైంది.

సాయంత్రం 05.05 - ఉత్తరప్రదేశ్ లో ముగిసిన తొలివిడత పోలింగ్.

English summary
Lucknow, Feb 11: Polling for 73 assembly constituencies spread across 15 districts in western Uttar Pradesh began at 7.00 am on Saturday amid tight security. In the first of the seven-phased staggered elections in the state, a total of 839 candidates are in the fray. Police officials said adequate security arrangements have been made for the keenly-fought contest. "Free and fair polls is our priority and we would urge people to go out in large numbers and take part in this beautiful festival of democracy" an Election Commission official told IANS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X