అక్రమ వలసదారులపై కొరడా... బంగ్లాదేశీయుల కోసం జల్లెడ
అక్రమ చొరబాటుదారుల కోసం యూపీ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులతోపాటు అనుమతులు లేకుండా అక్రమంగా నివసిస్తున్నవారిని, ఎక్కడ ఉన్నా, వారిని వెతికి పట్టుకోవాలని యూపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పోలీసులు అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర అంతర్గత భద్రత కోసం ఈ ఆపరేషన్ చేపట్టినట్టు యూపీ పోలీసులు తెలిపారు. దీంతో గత రెండు రోజులుగా అక్రమ చొరబాటుదారుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి
యూపీ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కొరఢా ఝలిపించింది. ముఖ్యంగా బంగ్లాదేశీయులపై నిఘాను పెంచింది. వారి అచూకి కనుగొనేందుకు యూపీ డీజీపీ ఓపీ సింగ్ ఓ సర్క్యూలర్ కూడ విడుదల చేశారు. దీంతో వివిధ మురికి ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలతో పాటు బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, నగరశివారు ప్రాంతాల్లో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతోపాటు ఎవరైన అనుమానంగా ఉన్నా వారి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు అనుమానితుల ఫింగర్‌ప్రింట్స్ కూడ తీసుకుంటున్నారు. తప్పుడు దృవ పత్రాలతో రాష్ట్రంలో ఉంటున్నవారి వివరాలు కూడ సేకరించాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశస్థులు అటు పశ్చిమబెంగాల్‌తో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోకి ఎక్కువగా చొరబడ్డారనే అనుమానాలను కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. అయితే పశ్చిమబెంగాల్‌లో మమతా సర్కార్ ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తోంది. దీంతో ఎన్ఆర్‌సీ నివేదికపై కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం నెలకోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో విదేశీయుల లెక్క తేలిన తర్వాత అక్కడ కూడ ఎన్‌ఆర్‌సీని అమలు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ సైతం రాష్ట్రంలో కూడ ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ దాడులను ముమ్మరం చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications