వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ ఫలితాలు: రికార్డులు తిరగరాసిన బీజేపీ, కాంగ్రెస్-ఎస్పీ ఘోర పరాజయం

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ చరిత్ర తిరగరాసింది. రాష్ట్రంలో తొలిసారిగా అత్యధిక సీట్లు సాధించే దిశగా ఆ పార్టీ దూసుకుపోతుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితాలు శనివారం వెలువడ్డాయి. కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. మాయావతి బీఎస్పీ కూడా బీజేపీ తుఫానులో నిలువలేకపోయింది.

యూపీలో ఆధిక్యం

బీజేపీ 321
ఎస్పీ+కాంగ్రెస్ 56
బీఎస్పీ 21
ఇతరులు 5

-అజిత్ సింగ్ ఆర్ఎల్డీ కంచుకోట బద్దలు
బీజేపీ జయకేతనం

-నోయిడాలో రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు గెలుపు

-అయోధ్యలో బీజేపీ గెలుపు

-పశ్చిమ యూపీలో జాట్ల ఓట్లు బీజేపీకే

-లక్ష ఓట్ల మెజార్టీతో రాజా బయ్యా గెలుపు

-35వేల మెజార్టీతో శివపాల్ యాదవ్ గెలుపు

ములాయం కోడలు ఓటమి

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబ సభ్యురాలికి కూడా ఓటమి తప్పలేదు. ములాయం కోడలు,ప్రతీక్‌యాదవ్‌ భార్య అపర్ణాయాదవ్‌ లఖ్‌నవూ కంటోన్మెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన రీటా బహుగుణ జోషి కమలం గుర్తుపై ఇదే స్థానం నుంచి పోటీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన అపర్ణాయాదవ్‌ బహుగుణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో అపర్ణ కోసం ములాయం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రచారం కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ సైతం అపర్ణాయాదవ్‌ కోసం ప్రచారం నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది.

తొలి గెలుపు బీజేపీదే..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌ జిల్లాలోని దేవ్‌బంద్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బ్రిజేష్‌ గెలుపొందారు. మణిపూర్‌లో తౌబల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆ రాష్ట్ర సీఎం ఇబోబి సింగ్‌ తొలి విజయం నమోదు చేశారు. ఇక్కడ ఇరోం షర్మిల ఓటమి చవిచూశారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కన్వర్‌పాల్‌ సింగ్‌ ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

కాగా, గోవాలో ఎంజీపీ పార్టీ తొలి విజయం నమోదు చేసింది. సౌత్‌గోవాలోని శాన్‌వోర్డెమ్‌ నియోజకవర్గం నుంచి ఎంజీపీ అభ్యర్థి దీపక్‌ ప్రభు విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ తొలి విజయం నమోదు చేసింది. హరిద్వార్‌ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఖ్వాజీ మొహద్‌ నిజాముద్దీన్‌ విజయం సాధించారు.

ఖాతా తెరిచిన ఎస్పీ, కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల కూటమి ఖాతా తెరిచింది. ఈ కూటమికి తొలి గెలుపు నమోదైంది. షహ్రాన్‌పూర్‌ జిల్లాలోని షహ్రాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మసూద్‌ అక్తర్‌ విజయం సాధించారు. యూపీలో భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అధికార సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేసినప్పటికీ విజయం అందని మానిపండుగానే మిగిలిపోతున్నట్లు కన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో మాయావతి బీఎస్పీ కూడా దారుణంగా వెనకబడింది.

-యూపీలో ఓటమిని అంగీకరించిన సమాజ్‌వాదీ పార్టీ

-కాంగ్రెస్, ఎస్పీ కూటమిని ప్రజలు తిరస్కరించారని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అభివృద్ధికే పట్టం కట్టారని చెప్పారు.

- లక్నో బీజేపీ కార్యాలయంలో సంబరాలు
-250 స్థానాల్లో ఆధిక్యం దిశగా బీజేపీ
- వెనకబడ్డ ఎస్పీ మంత్రి అజంఖాన్

- లక్నో, అలహాబాద్‌లో బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం

-వివాదాస్పద మంత్రి ప్రజాపతి వెనుకంజ

-లక్నో కంటోన్మెంట్‌లో ములాయం రెండో కోడలు అపర్ణ యాదవ్ వెనుకంజ

కౌంటింగ్‌ సెంటర్ల వద్ద డ్రోన్‌లు

ఉత్తర ప్రదేశ్‌లో కౌంటింగ్‌ సెంటర్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లును చేశారు. ఇక్కడ అక్రమాలు జరగకుండా నిఘా పెట్టారు. దీని కోసం డ్రోన్‌ కెమేరాలను కూడా వినియోగిస్తున్నారు.

రాహుల్‌ కటౌట్‌ మిస్సింగ్‌

ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందే ఎస్పీ ఆఫీస్‌ వద్ద నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భారీ కటౌట్‌ను తొలగించారు. దీని స్థానంలో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

- అమేథీలో బీజేపీ అభ్యర్థి ముందంజ

- యూపీలో ఊహించని ఫలితాలు
-కుందాలో బీజేపీ అభ్యర్థి రాజాభయ్యా ఆధిక్యం
-యూపీలో ఆధిక్యం దిశగా బీజేపీ
-మవూలో రౌడీ షీటర్ అన్సారీ(బీఎస్పీ ఆధిక్యం)

Uttar Pradesh Assembly Election Result 2017, Live

విజయం మాదే: శివపాల్

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీదే విజయం అని ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివ్‌పాల్‌యాదవ్‌ తెలిపారు. ' కౌంటింగ్‌ మొదలైంది. మాకు భారీ విజయం చేకూరనుంది' అని అన్నారు.

యూపీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 202 సీట్లు దక్కించుకోవాల్సిందే. రాష్ట్రంలోని 75 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఎస్పీ 403 సీట్లలో 224 సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీ 80, బీజేపీ 43, కాంగ్రెస్ 28 సీట్లను గెల్చుకుంది.

English summary
Get live results of Uttar Pradesh assembly election 2017. Read latest party-wise election results in UP with fastest updates. Read how many seats BJP, SP, Congress and BSP won in UP elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X