• search

కాటేసిందని! పాము తలను కొరికేసి, నమిలి పడేశాడు: అసలేం జరిగిందంటే..?

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   Bizarre : Man Bit Off A Snake’s Head, Watch Video

   లక్నో: పాము అంటే చాలా మంది ఆమడ దూరం పరుగెడతారు. ఎందుకంటే.. పాము కాటెస్తే ఏం జరుగుతోందో తెలుసు కాబట్టి. అయితే, ఇక్కడ మాత్రం అలా జరగలేదు. పాము తనను కాటేసిందనే కోపంతో ఓ వ్యక్తి.. ఏకంగా దాని తలను నోటితో కొరికేసి, నమిలి పడేశాడు.

   ఆ తర్వాత అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతని శరీరంపై ఎక్కడా కూడా పాము కాటు వేసినట్లు దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్డోయిలో శనివారం చోటు చేసుకుంది.

   హుటాహుటిన ఆస్పత్రికి

   హుటాహుటిన ఆస్పత్రికి

   వివరాల్లోకి వెళితే.. శుక్లాపూర్‌ భగార్‌ గ్రామానికి చెందిన సోనేలాల్‌ అనే రైతు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని వెంటనే ఘటనా స్థలానికి రావాలని మొఘాగంజ్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)కి చెందిన అంబులెన్స్‌కు స్థానికుడు ఒకరు ఫోన్‌ చేశారు. దీంతో హుటాహుటిన అతన్ని సీహెచ్‌సీలోని అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు.

   పాము కాటేసిందని..

   పాము కాటేసిందని..

   ఆ తర్వాత ఎమర్జెన్సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మహేంద్ర వర్మ, ఫార్మాసిస్ట్‌ హితేశ్‌ కుమార్‌ సదరు వ్యక్తికి వైద్యం అందించారు. సోనేలాల్‌ను పాము కాటేసిందని అతని స్నేహితులు రామ్‌ సేవక్‌, రామ్‌ స్వరూప్‌ ఈ సందర్భంగా వైద్యులకు తెలిపారు.

   బాధితుడి సమాధానం విని షాక్

   బాధితుడి సమాధానం విని షాక్

   కాగా, అతని శరీరాన్ని పరిశీలించగా ఎక్కడా ఎటువంటి పాము కాట్లు కనిపించలేదని.. అతనికి అత్యవసర సేవలందిస్తూ.. పరిశీలిస్తున్నట్లు హితేశ్‌ వెల్లడించారు. కొంత సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన సోనేలాల్‌ మాట్లాడుతూ.. జరిగిన విషయం చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ‘పొలంలో పశువులను మేపుతుండగా నన్ను పాము కాటేసింది. కోపంతో దాన్ని పట్టుకొని తల కొరికి నమిలి తర్వాత ఉమ్మివేశాను' అని సోనేలాల్ చెప్పాడు.

   అసలు జరిగిన విషయం

   అసలు జరిగిన విషయం

   దీంతో వైద్యులకు అసలు విషయం అర్థమైంది. పశువులను మేపుతుండగా పాము కాటేసిందనే భ్రమలో సోనేలాల్ దాని తలకొరికి నమిలి ఉమ్మేశాడని.. అయితే పాము శరీరంలో ఉండే విషం కారణంగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని డాక్టర్‌ మహేంద్ర వర్మ వెల్లడించారు. సోనేలాల్ ప్రవర్తన చాలా వింతగా ఉందని, పాము కాటేస్తే సాధారణ వ్యక్తి ఇలా ప్రవర్తించే అవకాశం లేదని అన్నారు స్టేట్ మెంటల్ హెల్త్ సొసైటీ సెక్రటరీ డా. ఎస్‌సీ తివారీ అన్నారు. అయితే, సోనేలాల్‌కు మద్యం, డ్రగ్స్ అలవాటుందని స్థానికులు చెబుతున్నారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   In a bizarre incident, a man bit off a snake’s head and chewed it before spitting it out to take revenge. The man claimed he did it because the snake had bitten him. However, the doctor could not find any bite marks on him. The incident took place in Uttar Pradesh’s Hardoi on Saturday.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more