ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ కామన్ సివిల్ కోడ్ హామీ- ఐదు రాష్టాల పోరుపై ప్రభావం ?
బీజేపీ అజెండాలో ఉన్న కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మతి)ని ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఆ పార్టీ బయటికి తీసింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం పుష్కర్ ధామీ .. తాము మరోసారి అధికారంలోకి వస్తే కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కామన్ సివిల్ కోడ్ హామీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
#WATCH | "Soon after its swearing-in, new BJP govt will form a committee to prepare draft of Uniform Civil Code in state. This UCC will provide for same laws regarding marriages, divorce, land-property & inheritance for all people, irrespective of their faith" says Uttarakhand CM pic.twitter.com/83SYlH2AkE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 12, 2022
తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, కొత్త బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ యొక్క ముసాయిదాను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సీఎం పుష్కర్ ధామీ ప్రకటించారు. ఈ కామన్ సివిల్ కోడ్ వివాహాలు, విడాకులు, భూమి-ఆస్తి & వారసత్వానికి సంబంధించి వారి విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఒకే విధమైన చట్టాలను అందిస్తుందని ఉత్తరాఖండ్ సీఎం తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కామన్ సివిల్ కోడ్ అమలుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు అర్ధమవుతోంది. అలాగే ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అజెండాగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video
ఇప్పటికే బీజేపీ అజెండాలో ఉన్న అయోధ్య రామాలయంతో పాటు పలు హామీల్ని కేంద్రం అమలు చేసేసింది ఇప్పుడు ఇక మిగిలింది కామన్ సివిల్ కోడ్ మాత్రమే. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఎన్నికల్లో దీన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవడం ద్వారా ప్రత్యర్ధులకు అడ్డుకట్ట వేయాలని కాషాయ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అదే క్రమంలో కామన్ సివిల్ కోడ్ అంశాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ వాడుకోవాలనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పొరుగున ఉన్న యూపీలోనూ దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
-
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications