UCC: యూనిఫాం సివిల్ కోడ్‍ను తీసుకురావడానికి సిద్ధమైన ఉత్తరాఖండ్..

యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లును ఆమోదించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పటు చేయనున్నట్లు తెలుస్తోంది. యూనిఫాం సివిల్ కోడ్ ఈ అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలో ఏర్పాటైన అయిదుగురు సభ్యుల కమిటీ దీనికి సంబంధించిన నివేదికను త్వరలో సమర్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ కు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. దేశంలోనే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.

వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాలలో అన్ని మతాలకు వర్తించే ఒక చట్టాన్ని రూపొందించనున్నారు. తాము అధికారంలోకి వస్తే యూసీసీని తీసుకొస్తామని ఉత్తరాఖండ్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 2022 మే 27న నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కమిటీ పదవీకాలాన్ని మూడోసారి మరో నాలుగు నెలలు పొడిగించారు.

Uttarakhand is all set to bring in a uniform civil code

ముందుగా జూన్ 30న జస్టిస్ దేశాయ్ ప్రతిపాదిత యూసీసీ బిల్లు ముసాయిదా పూర్తయిందని, ముసాయిదాతో పాటు నివేదికను ముద్రించి త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామని మీడియాకు తెలిపారు. కమిటీ రాబోయే మూడు నాలుగు రోజుల్లో తన నివేదికను సమర్పించనున్నట్లు సమాచారం. కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే యూసీసీని అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గతంలో ప్రకటించారు."కమిటీ తన నివేదికను సంకలనం చేసి మాకు సమర్పించిన వెంటనే, మేము దానిని రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ముందుకు తీసుకువెళతాము మరియు వీలైనంత త్వరగా దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాము" అని ధామి చెప్పారు.

జస్టిస్ దేశాయ్‌తో పాటు ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ప్రమోద్ కోహ్లీ, సామాజిక కార్యకర్త మను గౌర్, మాజీ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి శతృఘ్న సింగ్, డూన్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ సురేఖ దంగ్వాల్ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. కనీసం రెండు బిజెపి పాలిత రాష్ట్రాలు - మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ - UCCని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించడానికి కమిటీలను నియమించాయి. జాతీయ స్థాయిలో లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా UCCపై సంప్రదింపులు ప్రారంభించింది. త్వరలో దేశంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+