Valentine's day: పబ్ లో ప్రియురాలితో డ్యాన్స్ చేస్తూ కిటికీలో...

బెంగళూరు/బెళగావి: ప్రేమికుల రోజు లవర్స్ పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటారు. ప్రేమికులు ఎవరి వీలునుబట్టి వాళ్లు ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. పార్క్ లు, విహారయాత్రలకు వెళితే హిందూ సంఘ సంస్థలు ఎక్కడ బహిరంగంగా పెళ్లి చేసి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తారో అని చాలా మంది లవర్స్ భయపడుతున్నారు. అయితే ప్రేమికులకు రక్షణగా కొన్ని సంఘాలు నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రేమికులు వారి స్నేహితులతో కలిసి వాలైంటైన్స్ డే ముందు రోజు నుంచి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు.

మద్యాహ్నం హోటల్ లో భోజనం చేసి తరువాత షాపింగ్ చేశారు. రాత్రి ప్రియురాలు, స్నేహితులతో కలిసి ప్రియుడు పబ్ కు వెళ్లాడు. అర్దరాత్రి వాలైంటైన్స్ డే సందర్బంగా అందరూ పండగ చేసుకోవాలని అనుకున్నారు. మద్యం సేవించి ప్రియురాలితో కలిసి డ్యాన్స్ చేస్తున్న ప్రియుడు అదే పబ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ప్రేమికులకు ముందే రోజు పండగ మొదలైయ్యింది

ప్రేమికులకు ముందే రోజు పండగ మొదలైయ్యింది

కర్ణాటకలోని బెళగావిలో ప్రేమికులు ఉన్నారు. వాలైంటైన్స్ డే ముందు రోజే అంటే సోమవారం మద్యాహ్నం ప్రేమికులు కలుసుకున్నారు. ప్రేమికులు వారి స్నేహితులతో కలిసి ఓ ఫేమస్ హోటల్ లో భోజనం చేశారు. భోజనం చేసి కొంత సేపు తీరికగా కుర్చున్న ప్రేమికులు రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేశారు. ప్రేమికులు ఇద్దరు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకొవడానికి గిఫ్ట్ లు తీసున్నారు. సోమవారం అర్దరాత్రి వాలైంటైన్స్ డే మొదలౌతుందని, అంత వరకు అందరూ కలిసే ఉండి పండగ చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు, వారి స్నేహితులు పబ్ కు వెళ్లి మద్యం సేవించి ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నారు.

 పబ్ లో నుంచి దూకేసిన ప్రియుడు

పబ్ లో నుంచి దూకేసిన ప్రియుడు

బెళగావిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రోడ్డులోని తమ్మన్న ఆర్కేడ్ 3వ అంతస్తులోని బ్రూ-59 అనే ఫేమస్ పబ్ ఉంది. ఈ పబ్ కు ప్రేమికులు, వారి స్నేహితులు వెళ్లారు. రాత్రి పబ్ లో అందరూ మద్యం సేవించి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ప్రియుడు మూడో అంతస్తులోని పబ్ లోని కిటికీలో నుంచి కిందకు దూకేశాడు. అలా పబ్ లోని కిటికీలో నుంచి దూకిన యువకుడు రోడ్డుపై పడిపోవడంతో తలతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.

స్నేహితులు షాక్

స్నేహితులు షాక్

పబ్ లో నుంచి ప్రియుడు కిందకు దూకేయడంతో అతనితో పబ్ కు వెళ్లిన ప్రియురాలు, సాటి స్నేహితులు హడలిపోయాడు. మూడో అంతస్తు నుంచి కిందపడటంతో రక్తస్రావం కావడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పబ్‌లో అతనితో కలిసి డ్యాన్స్ చేస్తున్న స్నేహితులు మూడో అంతస్తు నుంచి కిందకు పరుగు తీశారు. స్నేహితులు కిందకు వచ్చి చూసే సమయానికే ఆ యువకుడు చలనం లేకుండా పడిఉన్నాడు.

 ప్రియుడు ఎవరు ?

ప్రియుడు ఎవరు ?

తీవ్రగాయాలైన ప్రియుడిని అతని స్నేహితులు బెళగావిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పబ్ కిటికీ నుంచి దూకి మృతి చెందిన యువకుడి పేరు యోగేష్ షాన్‌బాగ్ అలియాస్ యోగేష్ (28)గా గుర్తించామని పోలీసులు అన్నారు.

కిటికీ దగ్గరకు ఎందుకు వెళ్లాడు ?

కిటికీ దగ్గరకు ఎందుకు వెళ్లాడు ?

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా హాలియాకు చెందిన యోగేష్ షాన్‌బాగ్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చాడని పబ్ నిర్వహకులు పోలీసులకు చెప్పారు. పబ్‌లో మద్యం సేవించి డ్యాన్స్ చేస్తున్న యోగేష్ ఒక్కసారిగా కిటికీ వద్దకు వెళ్లి కిందకు దూకాడని అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు.

 సీసీటీవీ కెమెరాల్లో ఏముంది ?

సీసీటీవీ కెమెరాల్లో ఏముంది ?

బెళగావిలోని ఏపీఎంసీ పోలీస్‌స్టేషన్‌ లో కేసు నమోదు కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు యోగేష్ స్నేహితులను విచారించారు. బ్రూ-59 పబ్‌లోని అన్ని సీసీటీవీ కెమెరాలలో రికార్డైన అన్ని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పబ్ యజమాని, అక్కడ పని చేసే సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ప్రేమ వ్యవహారంలో ?

ప్రేమ వ్యవహారంలో ?

యోగేష్ కు, అతని స్నేహితుల మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే యోగేష్ ది ప్రేమ వ్యవహారం అని, ప్రియురాలితో ఏదైనా వివాదం జరిగిందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే యోగేష్ షాన్‌బాగ్ అలియాస్ యోగేష్ మృతికి గల అసలు కారణాలు వారి స్నేహితులను పూర్తిగా విచారణ చేసిన తరువాతే తెలుస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+