లవ్‌రాత్రి వివాదం: 'సల్మాన్ ఖాన్‌ను బహిరంగంగా కొడితే రూ.2 లక్షల రివార్డు'
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా వస్తున్న 'లవ్‌రాత్రి' సినిమా హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే నవరాత్రిని హేళ చేస్తున్నట్లుగా ఉందని హిందూ హై ఆజ్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గురువారం విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఏర్పాటు చేసిన హిందూ హై ఆజ్ సంస్థ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ ఓ ప్రకటన చేశారు. బహిరంగంగా సల్మాన్ ఖాన్‌ను కొట్టిన వారికి రూ.2 లక్షల బహుమతి ఇస్తామన్నారు.

ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. కాగా, గోవింద్ పరాషర్‌తో పాటు పలువురు కార్యకర్తలు ఆగ్రాలోని భగవాన్ థియేటర్‌కు చేరుకొని ఈ సినిమా పోస్టర్లను తగలుబెట్టి ఆందోళనకు దిగారు. సల్మాన్ ఖాన్‌కు, టైటిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications