ప్రేమించానంటూ రాథేమా వేధించింది: విహెచ్‌పి నేత సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

చంఢీఘడ్: డేరా బాబా తరహలోనే రాథేమా లీలలు కూడ ఒక్కోక్కటి వెలుగు చూస్తున్నాయి. ప్రేమ పేరుతో రాథేమా తనను తీవ్రంగా వేధించిందని విహెచ్‌పి సభ్యుడు సురేందర్ మిట్టల్ ఆరోపించారు.

రాథేమాకు షాక్: కేసు నమోదు, డేరా బాబా బాటలోనే?

డేరాబాబా గుర్మీత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో వివాదాస్పద మాత రాథేమా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ 'లీలలు' కూడా వెలుగు చూస్తున్నాయి. దైవాంశ సంభూతురాలిగా చెప్పుకునే రాథేమా.. ప్రేమ పేరిట తనను తీవ్రంగా వేధించినట్టు విశ్వ హిందూ పరిషత్‌ సభ్యుడు సురేందర్ మిట్టల్‌ ఆరోపించారు.

 VHP leader Surendar mittal slams on Radhe Maa

తనను 'ఐ లవ్ యూ' అంటూ రకరకాలుగా రాథేమా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించేదని, తీరా ఆమె ముందుకు వెళితే నానా శాపనార్థాలు పెట్టేదని సురేందర్ ఆరోపించారు.

''ఇది రెండేళ్లనాటి మాట. మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారం అయింది. ఆమెకు నా తరపు న్యాయవాది నోటీసు కూడా జారీచేశారు. ఇప్పుడు ఆమెపై కోర్టు ధిక్కార నోటీసులు కూడా ఫైల్ చేశాం.

హైకోర్టు ఆమెపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి బాబాలు, స్వామీజీల పేరిట నకిలీ గుర్తింపుతో దందాలు నడుపుతున్న వాళ్లను వెలుగులోకి తీసుకురావాలి..'' అని మిట్టల్ పేర్కొన్నాడు.

రాథేమాపై పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు గత మూడు రోజుల క్రితం కొరడా ఝళింపించిన సంగతి తెలిసిందే. సురేందర్ మిట్టల్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
VHP leader Surendar mittal made allegations on Radhe maa. He alleged that She harassed me. Punjab court ordered to police filed a case on Radhe maa on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి