Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీకృష్ణుడి పాటకు బీర్ బాటిల్స్ తో టిక్ టాక్, వార్నింగ్ వీడియో వైరల్, భజరంగ్ దళ్ దెబ్బ !

బెంగళూరు: బీరు బాటిల్స్ చేతిలో పట్టుకుని శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం అయిన పాట పెట్టుకుని టిక్ టాక్ తో హల్ చల్ చేసిన యువకులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెడుతామని హెచ్చరించడంతో సదరు యువకులు క్షమాపణలు చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కేరళలోని గురువాయర్ దేవాలయంలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం అయిన పాట పెట్టి పూజలు చేస్తారు. ఆ శ్రీకృష్ణుడి పాట సోషల్ మీడియాలో ఎప్పుడు హల్ చల్ చేస్తుంటుంది. శ్రీకృష్ణుడి పాట పెట్టుకుని తిక్క చేష్టలు చెయ్యాలని కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన యువకులు భావించారు.

Video of boys who danced with bottle and apolized gone viral in Karnataka

శ్రీకృష్ణుడి పాట పెట్టుకుని చేతిలో బీర్ బాటిల్స్ తో టిక్ టాక్ వీడియోలు తీశారు. బీరు తాగుతూ నిషాలో ఊగుతూ తూలుతూ డ్యాన్స్ లు చేశారు. ఈ యువకుల తిక్క చేష్టల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం భజరంగ్ దళ్ కార్యకర్తలకు తెలిసింది.

అంతే సోషల్ మీడియాలో ఉన్న వీడియోలోని యువకుల కోసం భజరంగ్ దళ్ కార్యకర్తలు గాలించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిదరిలో ఓ యువకుడిని గుర్తించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

చివరికి బీరు బాటిల్స్ తో టిక్ టాక్ వీడియోలు తీసిన యువకులు తమను క్షమించాలని, ఇక ముందు ఇలా చెయ్యమని వేడుకున్నారు. యువకులు క్షమించాలని వేడుకుంటున్న సమయంలో వీడియో తీసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇక ముందు ఇలా జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించి వదిలి పెట్టారు. క్షమించాలని యువకులు వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+