వీడు మాములోడు కాదు.. ఒకే వేదికపై నలుగురిని పెళ్లాడాడు (వీడియో)

సాధార‌ణంగా ఒక వ్య‌క్తికి ఇద్ద‌రు లేక ముగ్గురు భార్య‌లు ఉండ‌డం చూసుంటాం. ఒకేవేదిక‌పై ఇద్ద‌రు వ‌ధువ‌రూల‌ను పెళ్లాడిన ఘ‌ట‌న‌లు కూడా గ‌తంలో చాలా సార్లు చూసే ఉంటారు. కానీ, ఈ పెళ్లి వేదిక‌లో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఓ యువ‌కుడు ఏకంగా న‌లుగురు యువ‌తుల‌ను ఒకేసారి పెళ్లి చేసుకుని, పెళ్లికి వ‌చ్చిన అతిథుల‌ను షాక్‌కు గురిచేశాడు. ప్ర‌స్తుతం ఈ పెళ్లికి సంబంధించిన‌ వీడియో ఇప్ప‌డు సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇంత‌కుముందు కూడా జ‌రిగాయి. కానీ, గ‌తంలో జ‌రిగిన వాటిలో ఒకేవేదిక‌పై ఇద్ద‌రు యువ‌తులను పెళ్లాడిన సంఘ‌ట‌న‌లే ఎక్కువ‌గా ఉన్నాయి.

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు జీవితాలతో ముడిపడి ఉంటుంది. అయితే ఇప్ప‌డు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ పెళ్లి వీడియో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ పెళ్లి ఎక్క‌డ జ‌రిగిందో పూర్తి వివ‌రాలు తెలియ‌లేదు. ఈ పెళ్లి వీడియోలో మాత్రం సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న నలుగురు యువతులను ఒకేసారి వరుడు పెళ్లాడినట్లు చూపిస్తుంది. ఈ వీడియో చూసిన కొంద‌రు నెటిజన్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

A young man married four young women at once and shocked the wedding guests. Currently, the video of this wedding is going viral on social media,

భ‌ర్త ఆశీర్వాదం తీసుకుంటున్న న‌వ వ‌ధువ‌రూలు : ఈ పెళ్లి వీడియోను @musafir_vj అనే ట్విట్టర్ యూజర్ సోష‌ల్‌మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో వ‌రుడు తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతని వెనుక సంప్రదాయబద్ధంగా ముస్తాబైన నలుగురు వధువులు ప్రదక్షిణలు చేస్తున్నట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది. వీడియో చివర్లో నలుగురు భర్త పాదాలను మొక్కుతూ ఆశీర్వాదం తీసుకోవ‌డం ఇందులో మ‌నం చూడొచ్చు. ఈ వీడియోలో నేహా కక్కర్ రాసిన పెళ్లి పాట 'తుమ్ జీత్ గయే ఔర్ హమ్ హారే' బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తోంది. 'రథసారధి.. నా రథాన్ని కొండపైకి తీసుకెళ్లండి' అనే ఫన్నీ క్యాప్షన్‌ను ఈ వీడియోకు జోడించారు.

గతంలో ఇలాంటి సంఘ‌ట‌నే జార్ఖండ్‌లో జ‌రిగింది : ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజ‌న్లు ఇది ఫేక్‌వీడియో అని అంటున్నారు. మ‌రికొంద‌రేమో రీల్ చేస్తూ ప్రదక్షిణ చేసే డైరెక్షన్ మర్చిపోయారు అని కొందరు హాస్యాస్పదమైన కామెంట్లు పెడుతున్నారు. ఇక, కొంద‌రైతే వీడు మాములోడు కాదు అని అంటున్నారు. ఇలాంటి సంఘ‌ట‌నే గతేడాది జార్ఖండ్‌‌‌కి చెందిన సందీప్ అనే వ్యక్తికి ఎదుర‌య్యింది. కుసుమ్, స్వాతికుమారి అనే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడ‌ని ఓ యువ‌కుడిని ఆ ఊరి గ్రామ‌స‌భ వాళ్లిద్ద‌రి పెళ్లాడాల‌ని నిర్ణ‌యించింది. దాంతో చేసేదేమీ లేక ఆ యువ‌కుడు ఓకే వేదిక‌పై ఇద్ద‌రు యువ‌తుల్ని పెళ్లాడాడు. అప్ప‌ట్లో ఆ న్యూస్ వైర‌ల్ అయ్యింది. కానీ, ఇప్ప‌డు జ‌రిగిన ఈ పెళ్లి వేడుక గురించి ఎటువంటి స‌మాచారం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+