వీడియో: పైలట్ దంపతులను చితకబాదిన స్థానికులు
ఓ మహిళా పైలట్, ఆమె భర్త.. 10 సంవత్సరాల బాలికను ఇంట్లో పనికి పెట్టుకొని.. ఆ చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించారు. బాలిక అని కూడా చూడకుండా ఆమెను తీవ్రంగా హింసించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనై ఆ పైలట్, ఆమె భర్తపై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీ: మైనర్ బాలికను పనికి పెట్టుకుని చిత్రహింసలకు గురిచేసిన మహిళా పైలట్ ఆమె భర్తపై దాడి చేసిన స్థానికులు pic.twitter.com/2Lz49nq0j4
— oneindiatelugu (@oneindiatelugu) July 19, 2023
ఢిల్లీ (Delhi)లోని ద్వారక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న ఒక మహిళ ఓ విమానయాన సంస్థలో పైలట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా ఎయిర్‌లైన్స్ ఉద్యోగే. రెండు నెలల క్రిందట పది సంవత్సరాల బాలికను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం బాలికను చూసేందుకు ఆమె బంధువు ఒకరు వచ్చారు. చిన్నారి శరీరంపై గాయాలుండటం చూసి ఎలా అయ్యాయని అడిగారు. పైలట్, ఆమె భర్త ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలియడంతో ఆ బాలిక బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బాలిక బంధువులు పోలీసులు వచ్చేలోగానే మహిళా పైలట్ ఇంటి ముందుకు వచ్చి ఆ దంపతులతో గొడవపడ్డారు. వీధిలోకి లాగి వారిపై దాడికి పాల్పడ్డారు. పైలట్ యూనిఫాంలో ఉన్న మహిళా పైలట్ ను కొందరు మహిళలు జట్టుపట్టి బలంగా లాగి కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన భర్తపై కూడా వారు దాడిచేశారు. ఈలోగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కొడుతున్నవారిని నివారించారు. మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నందుకు భార్యాభర్తలపై కేసు నమోదు చేశారు. చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించామని, ఎటువంటి లైంగిక వేధింపులు జరగలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తన్నట్లు వెల్లడించారు.
గురుపాదస్వామి సిఫారసుల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థ(నిషేధం-నియంత్రణ) చట్టం 1986 లో సిద్ధమైంది. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలనూ గుర్తించి వాటిలో పిల్లలు పనిచేయడాన్ని ఈ చట్టం నిషేధించింది. మరి కొన్నింటిలో పనిచేసే పరిస్థితుల్ని చట్ట ప్రకారం నియంత్రించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ చట్ట ప్రకారం బాలకార్మిక సాంకేతిక సలహా సమితిని ఏర్పాటు చేసి ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలను గుర్తించే జాబితాను విస్తరింప చేశారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసం 1987లో ఒక జాతీయ విధానాన్ని రూపొందించారు.












Click it and Unblock the Notifications