Viral: అమ్మాయికి బీర్లు తాగించి గ్యాంగ్ రేప్, ఫ్రెండ్స్ తో గొడవలు, సోషల్ మీడియాలో వీడియో !
చెన్నై/తిరుచ్చి: 16 ఏళ్ల అమ్మాయితో ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడు. అమ్మాయికి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను బయటకు పిలుచుకుని వెళ్లారు. అమ్మాయి మీద ఆమెకు పరిచయం ఉన్న అబ్బాయితో పాటు మరో నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేసి వీడియోలు తీశారు. అమ్మాయికి ఆమె బంధువులు వివాహం చేశారు. మైనర్ కు వివాహం చేశారని తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను ప్రభుత్వ హాస్టల్ కు తరలించారు. అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె బంధువులు, పోలీసులు హడలిపోయారు.

తల్లిదండ్రులు చనిపోయారు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని ముసిరి ప్రాంతంలో 16 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితమే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. బంధువులు ఆ అమ్మాయి బాగోగులు చూసుకుంటున్నారు. ఒంటరిగా ఉంటున్న అమ్మాయి మీద ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొందరు యువకుల కన్నుపడింది.

అమ్మాయి మీద ఐదు మంది గ్యాంగ్ రేప్
మైనర్ అమ్మాయితో రాజా గణపతి అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. 2021 ఏప్రిల్ నెలలో అమ్మాయికి మాయమాటలు చెప్పిన రాజా గణపతి కొల్లిడి ప్రాంతంలోని పిలుచుకుని వెళ్లాడు. తరువాత మైనర్ అమ్మాయి మీద ఆమెకు పరిచయం ఉన్న రాజా గణపతి, దినేష్, రఘునాథ్ తో పాటు మరో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసి వీడియోలు తీశారు.

పెళ్లి చేసిన బంధువులు
గ్యాంగ్ రేప్ విషయం బయటకు చెబితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ఐదు మంది యువకులు బెదిరించారు. మైనర్ అమ్మాయి రాజా గణపతితో తిరుగుతోందని ఆమె బంధువులకు తెలిసింది. నాలుగు నెలల క్రితం బంధువులు అందరూ కలిసి మైనర్ అమ్మాయికి పెళ్లి చేశారు. విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను ప్రభుత్వ హాస్టల్ కు తరలించారు.

ఫ్రెండ్స్ మద్య గొడవలతో వీడియో వైరల్
అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె బంధువులు, పోలీసులు హడలిపోయారు. స్నేహితులతో రఘనాథ్ గొడవపడ్డాడనని, కోపంతో అతనే అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అమ్మాయిలతో బీర్లు తాగించి గ్యాంగ్ రేప్
మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో ఆమెకు ఐదు మంది కలసి బలవంతంగా ఆమెతో బీరు తాగించారని వీడియోలో స్పష్టంగా కనపడటం కలకలం రేపింది. పోలీసులు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు రఘనాథన్, దినేష్, రాజా గణపతితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications