మాజీ ఉద్యోగినికి లైంగిక వేధింపు: వర్సిటీ చైర్మన్ అరెస్ట్

సుమారు 9 నెలల క్రితం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన మీదట పోలీసులు ఎట్టకేలకు గిరీష్ చంద్రను అరెస్టు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో పోలీసులు ఆయనను జహంగీర్‌బాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఐపిసిలోని 376, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనిని అంతకముందు రెండు రోజుల ముందు విచారించారు.
ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై కాపలాదారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తన ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ చిన్నారిని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. అయితే తన ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని రాకేష్ కుమార్‌గా గుర్తించిన పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications