మంచం మీదకు వస్తే మజా చేద్దాం, స్వామీజీ ఆడియో, వీడియోలు వైరల్, భర్త హనీట్రాప్!

బెంగళూరు: ఉత్తర కర్ణాటకలోని ప్రసిద్ది చెందిన మఠం స్వామీజీ మీద లైంగిక ఆరోపణలు రావడంతో ఆ ప్రాంత ప్రజలు, మఠం భక్తులు షాక్ కు గురైనారు. మంచం మీదకు వస్తే మజా చేద్దాం అంటూ స్వామీజీ మహిళతో రాసలీలలు సాగించారని ఆరోపణలు ఉన్నాయి. యాదగిరి జిల్లా సురపుర హణసిహోళిలోని కాణ్వా పీఠం స్వామీజీ శ్రీ విద్యావారధి తీర్థ స్వామీజీ ఓ మహిళను లైంగిక వేంధిపులకు గురి చేశారని ఆరోపిస్తూ విడుదలైన వాట్సాప్ సందేశాలు, ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యియి. అయితే మహిళ భర్త హనీట్రాప్ కు పాల్పడ్డారని స్వామీజీ ఆరోపిస్తున్నారు.

మైసూరు నందిని !

మైసూరు నందిని !

మైసూరుకు చెందిన నందిని అనే మహిళతో స్వామీజీ శ్రీ విద్యావారధి తీర్థ స్వామీజీ వాట్సాప్ లో అసభ్యంగా మాట్లాడారని, అశ్లీల సందేశాలు పంపించారని ఆరోపిస్తూ విడుదలైన చిత్రాలు, ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్వామీజీ ఆడియో, వీడియోలు విడుదల చేశారని సమాచారం.

చాలా సీక్రెట్ గా ఉంటుంది

చాలా సీక్రెట్ గా ఉంటుంది

మైసూరుకు చెందిన నందిని అనే మహిళ వాట్సాప్ నెంబర్ సేకరించిన స్వామీజీ తనకు శారీరక సంబంధంతో సుఖం ఇవ్వాలని, ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంటుందని ఆమెకు చెప్పారని సమాచారం. మీ సమస్యలు అడిగే నెపంతో తన దగ్గరకు వస్తే అన్ని సవ్యంగా జరిగిపోతాయని స్వామీజీ నందినిని నమ్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో నందిని అనే మహిళకు పంపించిన అశ్లీల ఫోటోలు, ఆడియో, వీడియో ఇప్పుడు విడుదల కావడంతో వైరల్ అయ్యాయి.

స్వామీజీ ఏం చెప్పారంటే ?

స్వామీజీ ఏం చెప్పారంటే ?

మైసూరుకు చెందిన నందిని అనే మహిళతో తనకు అక్రమ సంబంధం కట్టపెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని, అందులో ఎలాంటి నిజం లేదని స్వామీజీ శ్రీ విద్యావారధి తీర్థ స్వామీజీ ఆ వార్తలను కొట్టిపడేశారు. తాను మొబైల్ ఫోన్ చాల తక్కువగా ఉపయోగిస్తానని, తన ఫోన్ కు లాక్ కూడా లేదని, ఆ మొబైల్ దుర్వినియోగం చేసి ఇలా తన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని శ్రీ విద్యావారధి తీర్థ స్వామీజీ విచారం వ్యక్తం చేశారు.

నందిని భర్త హనీట్రాప్

నందిని భర్త హనీట్రాప్

మైసూరుకు చెందిన నందిని అనే ఆమె భర్త హనీట్రాపింగ్ కు పాల్పడ్డారని శ్రీ విద్యావారధి తీర్థ స్వామీజీ ఆరోపిస్తున్నారు. తనకు ఏ మహిళతో అక్రమ సంబంధం లేదని, తాను ఎవ్వరినీ శారీరక సుఖం ఇవ్వాలని వాట్సాప్ సందేశాలు పంపించలేదని, కొందరు కావాలనే తనకు చెడ్డపేరు తీసుకురావడానికి ఇలా చేస్తున్నారని స్వామీజీ శ్రీ విద్యావారధి తీర్థ స్వామీజీ ఆరోపిస్తున్నారు.

స్వామీజీకి ఇద్దరు భార్యలు !

స్వామీజీకి ఇద్దరు భార్యలు !

శ్రీ విద్యావారధి తీర్థ స్వామీజీకి ఇంతకు ముందే ఇద్దరు భార్యలతో వివాహం అయ్యిందని, పిల్లలు ఉన్నారని అంటున్నారు. అనేక జిల్లాల్లో కాణ్వా మఠంకు ఆస్తులు ఉన్నాయని, వాటిని స్వామీజీ అక్రమంగా విక్రయించారని చాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మైసూరుకు చెందిన నందిని అనే మహిళతో స్వామీజీ రాసలీలలు సాగించడానికి ప్రయత్నించారని ఆడియో, వీడియోలు, అశ్లీల చిత్రాలు విడుదల కావడంతో కాణ్వా మఠం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+