Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా ఆస్తుల లెక్క మీకెందుకు: ఎన్నారై ట్విస్ట్ ఇచ్చిన మాల్యా

లండన్: బ్యాంకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్న విజయ్ మాల్యా తన విదేశీ స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. తనకు తన కుటుంబ సభ్యులకు చెందిన విదేశీ ఆస్తుల వివరాలను తెలుసుకునే హక్కు బ్యాంకులకు లేదని తేల్చి చెప్పారు.

తన ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్లో జూన్ 26న అందించేందుకు అనుమతినివ్వాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు రుణాలు ఇచ్చేటప్పుడు తన విదేశీ ఆస్తులను బ్యాంకులు పరిగణలోకి తీసుకోలేదని ఆయన కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

భారత్‌లోని ఆస్తుల వివరాలకు మాత్రమే బ్యాంకులు పరిమితం కావాలని సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. విజయ్ మాల్యా తరుపున ఆయన న్యాయవాది ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. 1988 నుంచి ప్రవాస భారతీయుడిగా(ఎన్నారై) ఉన్న తాను విదేశాల్లోని ఆస్తుల సమాచారాన్ని వెల్లడించనక్కర్లేదన్నారు.

విజయ మాల్యా ఎన్నారై ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. భారత్‌లో పన్ను రిటర్న్‌లను సమర్పించే సమయంలో కూడా ఈ విషయాలను పన్ను అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తన ముగ్గురు పిల్లలు, భార్యకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని పేర్కొన్నారు.

Vijay Mallya refuses to divulge overseas assets, willing to deposit Rs 1590 crore

భారత్‌తో పాటు విదేశాల్లో మాల్యా, ఆయన కుటుంబీకులకున్న ఆస్తుల వివరాలను 21 కల్లా వెల్లడించాల్సిందిగా సుప్రీంకోర్టు మాల్యాను ఇటీవల ఆదేశించింది. అలాగే కోర్టు ఎదుట ఎప్పుడు హాజరుకానున్న విషయాన్ని తెలియజేయాలని కూడా అడిగింది.

బకాయిలు చెల్లింపు, చర్చలు జరిపే విషయంలో తన నిజాయితీని నిరూపించుకునేందుకు కొంత మొత్తాన్ని డిపాజిట్లను చేయాలని సూచించింది. ఇదే విషయాన్ని అఫిడవిట్‌లో గుర్తు చేస్తూ తన కంపెనీలు సుప్రీం కోర్టు ఎదుట రూ.1591 కోట్లు డిపాజిట్ చేస్తాయన్నారు.

మాల్యాను దేశం నుంచి బహిష్కరించండి: ఈడీ

ఇప్పటికే కోర్టు ద్వారా మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయించుకొన్న (ఈడీ).. ఆయనను దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అంతేకాదు ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్(ఆర్సీఎన్) జారీ చేయాలంటూ సీబీఐకి సైతం త్వరలో లేఖ రాయనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+